'ఉరితీసే తలారి నరేంద్ర మోడీ' | Lalu Prasad calls Narendra Modi 'executioner' | Sakshi
Sakshi News home page

'ఉరితీసే తలారి మోడీ'

Apr 30 2014 8:18 PM | Updated on Mar 9 2019 3:26 PM

నరేంద్ర మోడీ- లాలూప్రసాద్ యాదవ్ - Sakshi

నరేంద్ర మోడీ- లాలూప్రసాద్ యాదవ్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 పాట్నా: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోద్రా అల్లర్లకు కారణమైన మోడీని చూస్తే కసాయి కూడా సిగ్గుతో తలదించుకుంటాడని నిన్న వ్యాఖ్యానించిన లాలూ ఈ రోజు  మోడీ ఉరితీసే తలారి అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.  పాట్నా విమానాశ్రయంలో లాలూ ఈరోజు విలేకరులతో మాట్లాడారు.  ‘‘మోడీ ఓ తలారి. ఆయన ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఇది మాత్రం మారదు’’ అని అన్నారు.

లోక్‌జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వన్ లాంటి వారు మోడీ వెంట వెళ్లడం తనకు బాధకలిగించిందన్నారు.  ఒక ముస్లింను బీహార్‌కు ముఖ్యమంత్రిని చేస్తానన్న పాశ్వన్  తలారి మోడీతో వెళ్లారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement