వైఎస్సార్ సీపీలో చేరికలు | join in ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో చేరికలు

Apr 10 2014 2:43 AM | Updated on Apr 4 2019 5:53 PM

వైఎస్సార్ సీపీలో చేరికలు - Sakshi

వైఎస్సార్ సీపీలో చేరికలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైఎస్సార్ సీపీని గెలిపిస్తాయని పార్టీ అర్బన్ అభ్యర్థి అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.

శివాజీనగర్, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైఎస్సార్ సీపీని  గెలిపిస్తాయని పార్టీ అర్బన్ అభ్యర్థి అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో  వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వెయ్యి మంది మహిళలు, యువకులు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 శ్రీధర్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలే వైఎస్సార్ పార్టీని గెలిపిస్తాయన్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు చేయని సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకుసాగారని అన్నారు.

ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. వైఎస్సార్ చేపట్టిన పథకాలను చూసి, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ అమలుచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో శాశ్వతమైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రైతులకు అండగా నిలిచారన్నారు. ఆరోగ్యశ్రీతో అందరికి ప్రాణదాత అయ్యారని  అన్నారు. అనంతరం వందలాది మంది కార్యకర్తలతో పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

 నామినేషన్ దాఖలు

 బుధవారం దశమి కావడంతో  నామినేషన్ దాఖలు చేసినట్లు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఉదయం ఒక సెట్‌ను, మధ్యాహ్నం మరో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.  ఈ కార్యక్రమంలో సంతోష్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, శ్రీధర్, వాసురెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారు శివనంద్, నరేష్‌గౌడ్, సుభాష్, సాయిలు, వంశీ, మహిళలు, కార్యకర్తలు, నాయకులు  తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement