వైఎస్‌ఆర్ సీపీలో చేరికలు | inclusions in ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీలో చేరికలు

Apr 3 2014 1:41 AM | Updated on Mar 18 2019 9:02 PM

మండలంలోని గుచ్చిమి, జోగింపేట గ్రామాల్లో టీటీపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలు కుటుంబాలు బుధవారం వైఎస్‌ఆర్ సీపీలో చేరాయి.

 సీతానగరం, న్యూస్‌లైన్: మండలంలోని గుచ్చిమి, జోగింపేట గ్రామాల్లో టీటీపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలు కుటుంబాలు బుధవారం వైఎస్‌ఆర్ సీపీలో చేరాయి. ఈ మేరకు పార్టీ నాయకులు హరిగోపాలరావు, పి.నాగభూషణరావు, సర్పంచ్ మర్రాపు శ్రీదేవి, పోల తాతబాబులు మాట్లాడుతూ వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉన్న బొబ్బిలి రాజులకు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు.

 

ఈ సందర్భంగా గుచ్చిమి నుంచి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మరిశర్ల సత్యవతమ్మ, అప్పలనాయుడు, లక్షున్నాయుడు, ముసలినాయుడు, ఆనం ద్, అప్పలనాయుడు, శ్రీ ను, కామేశ్వరరావుతో సహా 40 కుటుంబాలు పార్టీలో చేరాయి.
 అలాగే జోగింపేట నుంచి మాజీ సర్పంచ్ పోల ఈశ్వరనారాయణ, శ్రీనివాసరావులతో సహా 30 కుటుం బాలు వైఎస్‌ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నాయి.

 

పార్టీ తరఫున జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని గెలిపించాలని డీసీసీబీ డెరైక్టర్ బి.చిట్టిరాజు, తెంటు వెంకటప్పలనాయుడు, ధనుంజయ్‌నాయుడులు కోరారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ఎన్.రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు అంబటి కృష్ణంనాయుడు, పి.వెంకటనాయుడు, సబ్బాన శ్రీనివాసరావు, గోపాల్, సత్యం తదితరులుపాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement