ఎన్నికల పోలింగ్కు కొన్ని గంటల ముందు విలేకరుల సమావేశం పెట్టిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని విశాఖపట్నం వైఎస్‌ఆర్ సీపీ అధికారి ప్రతినిధి గుడిమెట్ల రవిరెడ్డి డిమాండ్ చేశారు.
విశాఖపట్నం: ఎన్నికల పోలింగ్కు కొన్ని గంటల ముందు విలేకరుల సమావేశం పెట్టిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని విశాఖపట్నం వైఎస్‌ఆర్ సీపీ అధికారి ప్రతినిధి గుడిమెట్ల రవిరెడ్డి డిమాండ్ చేశారు. సబ్బం హరి పచ్చి అవకాశవాదని విమర్శించారు.
బీజేపీ నుంచి సబ్బం హరికి ఎన్ని కోట్ల రూపాయలు ముట్టాయని ప్రశ్నించారు. సమైక్యవాదులంతా సబ్బం హరి తీరును ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు బీజేపీ మద్దతిచ్చిన విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుయుక్తులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు.