దేశవ్యాప్తంగా ప్రచారం సమాప్తం | elections campaign end in India | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా ప్రచారం సమాప్తం

May 10 2014 6:09 PM | Updated on Sep 2 2017 7:11 AM

దాదాపు రెండు నెలలుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారం దేశ వ్యాప్తంగా ముగిసింది. శనివారం సాయంత్రం ఆరు గంటలతో ప్రచార గడువుకు తెరపడింది.

న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారం దేశ వ్యాప్తంగా ముగిసింది. శనివారం సాయంత్రం ఆరు గంటలతో ప్రచార గడువుకు తెరపడింది. సోమవారం తుది విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. 41 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎనిమిది విడతలుగా లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకూ 502 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు. మరో విడత మాత్రమే మిగిలుంది. సోమవారంతో సుదీర్ఘ ప్రకియకు ముగింపు కార్డు పడనుంది. ఈ నెల 16న లోక్సభ, తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement