చంద్రబాబు చీకటి పాలన వద్దేవద్దు | don't believe tdp president nara chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చీకటి పాలన వద్దేవద్దు

May 3 2014 3:04 AM | Updated on Jul 28 2018 6:33 PM

చంద్రబాబు చీకటి పాలన వద్దేవద్దు - Sakshi

చంద్రబాబు చీకటి పాలన వద్దేవద్దు

చంద్రబాబు చీకటి పాలనను ప్రజలెవరూ కోరుకోవద్దని వైఎస్సార్ సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ తోట చంద్రశేఖర్ హితవు పలికారు.

 వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్
 
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : చంద్రబాబు చీకటి పాలనను ప్రజలెవరూ కోరుకోవద్దని వైఎస్సార్ సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ తోట చంద్రశేఖర్ హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో షర్మిల నిర్వహించిన రోడ్‌షోలో భాగంగా జేపీ సెంటర్‌లో ప్రజల ను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు పాలనను గుర్తుచేస్తే ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలు చెందుతున్నారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు స్వయంగా నడవలేక సినిమా యూక్టర్‌ను, మతతత్వ నాయకుడిని ఊతకర్రలుగా చేసుకుని ప్రచారం సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉచిత వాగ్దానాలను నమ్మి ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని అన్నారు.

మరో 20 రోజుల్లో  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడనున్నామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి 3వేల కిలోమీటర్లు తిరిగి ఓదార్పు యాత్ర చేశారని, ప్రపంచ చరిత్రలోనే లేనివిధంగా షర్మిల 3వేల కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. వీరిద్దరూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి పల్లెలో పేదల గడపలు తొక్కి వారి గుండెచప్పుడు విన్నారన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి ఐదేళ్లపాటు సేవచేసే భాగ్యాన్ని కల్పించాలని ఆయన కోరారు.
 
 భారీ మెజార్టీతో గెలిపించాలి : ఘంటా మురళీ
 రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ  అన్నారు. ప్రజలు బాగా ఆలోచించి పార్టీ ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి దేవీప్రియలకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement