'నన్ను ఓడించటం టీఆర్ఎస్ తరంకాదు' | DK Aruna takes on trs | Sakshi
Sakshi News home page

'నన్ను ఓడించటం టీఆర్ఎస్ తరంకాదు'

Apr 18 2014 11:23 AM | Updated on Mar 18 2019 9:02 PM

'నన్ను ఓడించటం టీఆర్ఎస్ తరంకాదు' - Sakshi

'నన్ను ఓడించటం టీఆర్ఎస్ తరంకాదు'

తనను ఓడించటం టీఆర్ఎస్ తరం కాదని మాజీమంత్రి, గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే డీకె అరుణ స్ఫష్టం చేశారు.

హైదరాబాద్ : తనను ఓడించటం టీఆర్ఎస్ తరం కాదని మాజీమంత్రి, గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే డీకె అరుణ స్ఫష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శుక్రవారమిక్కడ మాట్లాడుతూ  ఈనెల 21న మహబూబ్నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని వెల్లడించారు.  ఇక ఎన్నికల సమరంలో డీకె అరుణ తనదైన శైలిలో ప్రజాభిమానం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

తల్లికి మద్దతుగా ఆమె ఇద్దరు కుమార్తెలు శృతిరెడ్డి, స్నిగ్దారెడ్డిలు కూడా ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు.  ప్రజలను కలుసుకుంటూ గద్వాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తన తల్లి అరుణను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సేవకురాలిగా పదేళ్లలో అరుణ వ్యవహరించిన తీరును, ప్రజలకు అందుబాటులో ఉండే తీరును వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement