బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి | development of telangana with bjp | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి

Mar 25 2014 1:22 AM | Updated on Mar 29 2019 9:18 PM

బీజేపీలో చేరుతున్న టీఆర్‌ఎస్ నాయకులు - Sakshi

బీజేపీలో చేరుతున్న టీఆర్‌ఎస్ నాయకులు

బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్ర శేఖర్ తెలిపారు.

కట్టంగూర్, న్యూస్‌లైన్ బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్ర శేఖర్ తెలిపారు. సోమవారం ఎరసానిగూడెం, కల్మెర గ్రామాలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ నాయకలు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

 

నరేంద్రమోడీ ప్రధాని అయితేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో తలారి యాదగిరి, కటికం శ్రీను, కొరివి శివశంకర్, బంటు సుదర్శన్, శ్రావన్‌కుమార్‌రెడ్డి, సురేష్, కార్యక్రమంలో గోలి అమరేందర్‌రెడ్డి, గుండగోని గిరిబాబు, కూతురు లక్ష్మారెడ్డి, మండల వెంకన్న ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement