క్రాస్ ఓటింగ్ కలవరం | Cross-voting fever in political leaders | Sakshi
Sakshi News home page

క్రాస్ ఓటింగ్ కలవరం

May 2 2014 12:28 AM | Updated on Sep 2 2017 6:47 AM

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. తమకు పడాల్సిన ఓట్లు బరిలో నిలిచిన ఇతరుల ఖాతాలో చేరిపోయాయేమో అనే సందేహం వారి లో నెలకొంది.

 సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను క్రాస్ ఓటిం గ్ భయం పట్టుకుంది. తమకు పడాల్సిన ఓట్లు బరిలో నిలిచిన ఇతరుల ఖాతాలో చేరిపోయాయేమో అనే సందేహం వారి లో నెలకొంది. క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగితే అది తమ గెలుపునకే గండికొట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అండతోనే ఎన్నికలు జరిగాయి అనేది స్పష్టమైనా ఆ ఓట్లు త మకు ఏ మేరకు అండగా జత కూడాయో తేల్చుకునే పనిలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు రంగంలో ఉన్నా వారిపై ఉన్న వ్యతిరేకతతో ఇతరులకు ఓటువేస్తే అది అభ్యర్థుల భవితవ్యాన్నే మార్చనుంది. పొత్తులున్నా దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసిన దాఖలాలు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులతోపాటు ఆయా పార్టీలకు చెందిన పలువురు నాయకులు అంగీకరించడం గమనార్హం.
 
 అన్ని స్థానాల్లోనూ ఇదే పరిస్థితి..
 బీజేపీ-టీడీపీ పొత్తుల్లో క్రాస్ ఓటింగ్ స్ప ష్టంగా కనిపించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలోని బీజేపీ శ్రేణులు పార్లమెంట్ ఓటును మిత్రపక్షాల అభ్యర్థికి కాకుండా మరో ఉ ద్యమ పార్టీకి వేసినట్లు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని జిల్లాలో ఉన్న మూడు అసెం బ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెల కొంది. ఆయా చోట్ల బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఓటును తమ పార్టీ నేతకు వేసి ఎంపీ ఓటును మరో పార్టీకి వేసినట్లు సం బంధిత పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
 
ఒ క ఓటు అటు.. మరో ఓటు ఇటు అని లె క్కలు వేసుకుని వెళ్లినవారు పరిస్థితుల ప్రభావంతో కాస్త గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి తాము ముందుగా వేసే ఓటు ఎంపీ అభ్యర్థికో లేదా ఎమ్మెల్యే అభ్యర్థికో స రైన అవగాహన లేదు. దీంతో వారు ఫలా నా పార్టీకి ఓటు వేస్తున్నాం అని భావించి ఇంకో పార్టీకి సై అన్నారేమో అనే భావన వ్యక్తమవుతోంది. తొలుత వేసే ఓటు ఎం పీకి, తర్వాతిది ఎమ్మెల్యే ఖాతాలోకి వె ళ్తుంది. ఈ విషయమై స్పష్టమైన అవగాహన కల్పించకపోవడంతో క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున్నే జరిగి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా క్రాస్ ఓటింగ్‌తో ఆధారంగా సదరు నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రాజ కీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement