తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల | congress released telangana candidates list | Sakshi
Sakshi News home page

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

Apr 5 2014 11:07 PM | Updated on Aug 14 2018 4:21 PM

తెలంగాణలో లోక్సభకు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి.

న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్సభకు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేసే 16 మంది ఎంపీ అభ్యర్థుల  పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. దీనికి సంబంధించి జాబితాను శనివారం సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. ఇందులో ఖమ్మం స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ను  కాంగ్రెస్ సిద్ధం చేసినా  విడుదలను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసింది. 110 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 29 మంది బీసీలు, 20 మంది ఎస్సీలు, 9 మంది ఎస్టీలు, 5 మైనార్టీలు, 7 మహిళలకు కాంగ్రెస్ టికెట్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ విడుదల జేసిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో జేఏసీ నేతలు గజ్జెల కాంతం, అద్దంకి దయాకర్ లకు చోటు లభించినట్లు సమాచారం. తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్,  చొప్పదండి నుంచి గజ్జెల కాంతం పోటీకి దింపేందుకు కాంగ్రెస్ యోచిస్తోంది.  అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటనను హైకమాండ్ ఆదేశాలతో మధ్య నిలిపివేశారు. అభ్యర్థుల పేర్లు ప్రకటించే సమయంలో అధిష్టానం నుంచి ఫోన్‌కాల్ రావడంతో అభ్యర్థుల జాబితా చదవడాన్నిపార్టీ ప్రతినిధి రణదీప్ మధ్యలోనే నిలిపివేశారు.


తెలంగాణ కాంగ్రెస్‌ లోకసభ అభ్యర్ధుల జాబితా


నిజామాబాద్‌ -   మధుయాష్కీ
జహీరాబాద్‌ - సురేష్‌ షెట్కర్
కరీంనగర్‌ - పొన్నం ప్రభాకర్‌
పెద్దపల్లి - జి.వివేక్‌
వరంగల్‌ -  రాజయ్య
మహబూబాబాద్‌ - బలరామ్‌ నాయక్‌
భువనగిరి -  కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి
నల్గొండ- గుత్తా సుఖేందర్‌ రెడ్డి
మహబూబ్‌నగర్‌ - జైపాల్‌ రెడ్డి
నాగర్‌ కర్నూలు - నంది ఎల్లయ్య
సికింద్రాబాద్‌ - అంజన్‌ కుమార్‌ యాదవ్‌
మల్కాజిగిరి - సర్వే సత్యనారాయణ
ఆదిలాబాద్ - నరేష్‌ జాదవ్‌
మెదక్‌ - శ్రవణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌ - సామా కిషన్‌రెడ్డి
చేవెళ్ల - కార్తిక్‌రెడ్డి
ఖమ్మం - సిపిఐ కేటాయింపు

 

తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో చదివిన పేర్లు

జనగాం- పొన్నాల లక్ష్మయ్య
హుజుర్‌నగర్‌-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఆందోల్- దామోదర్ రాజనర్సింహ
మధిర- భట్టి విక్రమార్క
కంటోన్మెంట్‌- క్రిషాంక్‌
తుంగతుర్తి- అద్దంకి దయాకర్
చొప్పదండి- గజ్జెల కాంతం


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement