'ఫేస్‌బుక్ అకౌంట్ చెప్పాల్సిందే' | Sakshi
Sakshi News home page

'ఫేస్‌బుక్ అకౌంట్ చెప్పాల్సిందే'

Published Tue, Apr 8 2014 8:37 AM

'ఫేస్‌బుక్ అకౌంట్ చెప్పాల్సిందే' - Sakshi

హైదరాబాద్: నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులకు సామాజిక వెబ్‌సైట్లలో ఖాతాలు ఉన్నట్లైతే, సదరు ఖాతాల వివరాలను అఫిడవిట్‌లో తప్పనిసరిగా పేర్కొనాల్సిందేనని సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇ.శ్రీధర్ స్పష్టం చేశారు. అలాగే.. నామినేషన్ దాఖలు చేయదలిచిన అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఆగకుండా ముందుగానే తమ పత్రాలు దాఖలు చేయాలని కోరారు.

 

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ నిమిత్తం సుమారు 50 మంది నామినేషన్ పత్రాలు తీసుకె ళ్లారన్నారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను, మద్ధతుదారుల ఓటు నెంబర్లను నిశితంగా పరిశీలించేందుకు కొంత సమయం పడుతుందని, చివరి నిమిషంలో హడావిడిగా తెస్తే పరిశీలన సాధ్యం కాదన్నారు. అభ్యర్థుల పత్రాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టరేట్‌లో సిబ్బందిని అందుబాట్లో ఉంచామని, వారి సేవలను వినియోగించుకోవాలని జేసీ శ్రీధర్ కోరారు.

Advertisement
Advertisement