breaking news
jc sridhar
-
ఏపీలో నలుగురు ఐఏఎస్‌ల బదిలీ
-
ఏపీలో నలుగురు ఐఏఎస్‌ల బదిలీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్‌ను సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన జేసీ శ్రీధర్ సీఆర్డీఏ కమిషనర్‌గా నియమించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్‌ను విశాఖ ఈపీడీసీఎల్ సీఎండీగా బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్ యాదవ్‌ను విజయనగరం కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
'ఫేస్బుక్ అకౌంట్ చెప్పాల్సిందే'
హైదరాబాద్: నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులకు సామాజిక వెబ్సైట్లలో ఖాతాలు ఉన్నట్లైతే, సదరు ఖాతాల వివరాలను అఫిడవిట్లో తప్పనిసరిగా పేర్కొనాల్సిందేనని సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇ.శ్రీధర్ స్పష్టం చేశారు. అలాగే.. నామినేషన్ దాఖలు చేయదలిచిన అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఆగకుండా ముందుగానే తమ పత్రాలు దాఖలు చేయాలని కోరారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ నిమిత్తం సుమారు 50 మంది నామినేషన్ పత్రాలు తీసుకె ళ్లారన్నారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను, మద్ధతుదారుల ఓటు నెంబర్లను నిశితంగా పరిశీలించేందుకు కొంత సమయం పడుతుందని, చివరి నిమిషంలో హడావిడిగా తెస్తే పరిశీలన సాధ్యం కాదన్నారు. అభ్యర్థుల పత్రాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టరేట్లో సిబ్బందిని అందుబాట్లో ఉంచామని, వారి సేవలను వినియోగించుకోవాలని జేసీ శ్రీధర్ కోరారు.