అసలు నీకెందరు భార్యలున్నారు... దమ్ముంటే ఎక్కడెక్కడ ప్రచారంలో ఉన్నారో చెప్పు చూద్దాం...’ అంటూ ప్రత్యర్థి సైతం పరస్పరంగా వ్యక్తిగత జీవితంపైనే దండెత్తాడు.
‘వెంట భార్య లేకుంటే.. ఆయన అసలు ప్రచారానికే రాడు. ఆమె అందరి కడుపులు కోసి అడ్డగోలుగా సంపాదిస్తోంది..’ అని ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థిపై వ్యంగ్యంగా వ్యక్తిగత ఆరోపణలకు దిగాడు.
‘అసలు నీకెందరు భార్యలున్నారు... దమ్ముంటే ఎక్కడెక్కడ ప్రచారంలో ఉన్నారో చెప్పు చూద్దాం...’ అంటూ ప్రత్యర్థి సైతం పరస్పరంగా వ్యక్తిగత జీవితంపైనే దండెత్తాడు.
ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న కొద్దీ నేతలు నోరు జారుతున్నారని ఈ దూషణల పర్వం చూస్తే అర్థమవుతోంది. ప్రచార పర్వంలో వీరి మాటలు వింటున్న సామాన్య జనం సైతం... అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు పోటీపడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లేనా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పోటీలో ఉన్న అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు పాల్పడవద్దు. కానీ.. ప్రచారపర్వంలో తమకు అడ్డూ అదుపేముంది... అన్నట్లుగా అభ్యర్థులు ఆక్షేపణీయంగా మాట్లాడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.