వైఎస్‌ఆర్ సీపీతోనే సమన్యాయం | Acquitas with ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీతోనే సమన్యాయం

Apr 26 2014 4:17 AM | Updated on Jul 26 2019 5:49 PM

వైఎస్‌ఆర్ సీపీతోనే అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

 ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్:  వైఎస్‌ఆర్ సీపీతోనే అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ-సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో సుమారు 4000 మోటార్ సైకిళ్లతో ర్యాలీ ప్రారంభమైంది. ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సీపీఎం-వైఎస్‌ఆర్ సీపీ కూటమి విజయం ఖాయమని; అనైతిక..అవకాశవాద పొత్తులు పెట్టుకున్న టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్-సీపీఐ కూటమిల ఓటమి తథ్యమని అన్నారు.
 ఈ ర్యాలీని పెవిలియన్ గ్రౌండ్‌లో సీపీఎం జిల్లా నాయకురాలు అఫ్రోజ్ సమీనా ప్రారంభించారు.

 ర్యాలీలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి సీపీఎం-వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులతోపాటు సీపీఎం నేత తమ్మినేని, ఆ పార్టీ పాలేరు అభ్యర్థి పోతినేని సుదర్శన్, వైఎస్‌ఆర్ సీపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీ పెవిలియన్ గ్రౌండ్ నుంచి కాల్వొడ్డుకు చేరేందుకు సుమారు గంటకు పైగా సమయం పట్టింది.

 ర్యాలీలో పొంగులేటి, తమ్మినేనితోపాటు ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూష ణం, పాలేరు అభ్యర్థి పోతినేని సుదర్శన్, మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, పాలేరు వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తోట రామారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు అక్రం అలీ, నాయకులు ఆకుల మూర్తి, జిల్లేపల్లి సైదులు, భీమనాధుల అశోక్‌రెడ్డి, ఆరెంపుల వీరభద్రం; సీపీఎం నాయకులు బుగ్గవీటి సరళ, నున్నా నాగేశ్వరరావు, బత్తుల లెనిన్, బండారు రవికుమార్, యర్రా శ్రీకాంత్, గుగులోత్ ధర్మానాయక్, కల్యాణం వెంకటేశ్వర్లు, నర్సయ్య, విక్రమ్, చంద్రశేఖర్, జబ్బార్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement