టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రత్యేకం... | TSPSC Exam Special | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రత్యేకం...

Sep 17 2015 12:30 AM | Updated on Sep 3 2017 9:31 AM

తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగానే వేల ఉద్యోగాలు ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తోంది. వందల్లో పోస్టులు..

 గ్రూప్స్ సందేహాలకు
 సాక్షి నిపుణుల
 సమాధానాలు
 
 తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగానే వేల ఉద్యోగాలు ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తోంది. వందల్లో పోస్టులు.. లక్షల్లో పోటీ! సర్కారు కొలువు కొట్టాలంటే.. అభ్యర్థులు తక్షణమే ప్రిపరేషన్ ప్రారంభించాలి. అయితే, కొత్త రాష్ట్రంలో  సరికొత్త సిలబస్.. గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్4, ఏఈఈ, ఏఈ, ఎస్‌ఐ/పోలీస్‌కానిస్టేబుల్.. ఇతర టీఎస్‌పీఎస్సీ పరీక్షల జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ సిలబస్ మొదలు.. తెలంగాణ చరిత్ర-సంస్కృతి, ఉద్యమ చరిత్ర; తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ; ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్; సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఇలా ఆయా పేపర్ల వారీగా, సబ్జెక్టుల వారీగా, చాప్టర్‌ల వారీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి.! ఏ సబ్జెక్టుకు, ఏ చాప్టర్‌కు ఏఏ బుక్స్ చదవాలి?! చాప్టర్‌ల వారీగా ప్రామాణికమైన రిఫరెన్స్ బుక్స్ ఏంటి? నాణ్యమైన మెటీరియల్‌ను సేకరించుకోవడం ఎలా..పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది..!? ఇలా లక్షల మంది విద్యార్థులకు అనేక సందేహాలు..!! మీ సందేహాలను సబ్జెక్టు నిపుణలు, లేదా సిలబస్ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి సాక్షి నివృత్తి చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా సాక్షి జిల్లా టాబ్లాయిడ్‌లోని ప్రతి రోజూ 4పేజీల విద్యలో టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రత్యేకం, ప్రతి గురువారం 8పేజీల భవితను ఫాలో అవుతూ మీ సందేహాలను మాకు పంపించడమే!
 మీ సందేహాలు
 sakshieducation@gmail.comMకు
 మెయిల్ చేయండి.
 మా చిరునామా:
 సాక్షి విద్య డెస్క్,
 కేరాఫ్ సాక్షి జర్నలిజం స్కూల్
 8-2-696, 697/75/1, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్, హైదరాబాద్-500008.
 
 టీఎస్‌పీఎస్సీ ఏఈఈ స్డటీ
 మెటీరియల్  - ఆన్‌లైన్ టెస్ట్స్
 హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తాజాగా విడుదల చేసిన 770 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్షలు సెప్టెంబరు 20న జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 కేంద్రాల్లో వీటిని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి ఏఈఈ సివిల్ ఇంజనీరింగ్ పేపర్ 2 కి ఆన్‌లైన్ పరీక్షలు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ప్రశ్నకు వివరణతో నిపుణులు రూపొందించిన 3 గ్రాండ్ టెస్టులు కేవలం రూ.50కే అందిస్తోంది. వీటితో పాటు జనరల్ స్టడీస్ పేపర్‌లో ఉండే జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టులకు ఇంగ్లిష్‌లో మెటీరియల్ అందిస్తోంది.
 పోర్టల్‌లో ఏమున్నాయి?
 ఏఈఈ - పేపర్-2 సివిల్ ఇంజనీరింగ్ 3 టెస్టులు
 పేపర్-1 జనరల్ స్టడీస్ స్టడీ మెటీరియల్
 http://onlinetests.sakshieducation.com/
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement