TSPSC Group 4 OMR Rules and Bubbling Tips, Key Instructions - Sakshi
Sakshi News home page

గ్రూప్‌-4 ప‌రీక్ష‌.. అభ్య‌ర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే..

Jun 29 2023 9:14 PM | Updated on Jun 29 2023 9:43 PM

TSPSC Group 4 OMR Rules and Bubbling Tips Key Instructions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో రెండు రోజుల్లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం (జులై 1) నిర్వహించే ఈ పరీక్షను రాసేందుకు లక్షలాది మంది విద్యార్థులు సన్నద్ధమై ఉన్నారు. ఈ ప‌రీక్ష కోసం తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ కడ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే హాల్‌ టికెట్లు విడుదల చేశారు అధికారులు. ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్‌-4 పోస్టులకు  9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌ను రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు.

గ్రూప్‌-4 పరీక్ష అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ ఇటీవల జారీ చేసిన కొన్ని కీలక సూచనల్ని పరిశీలిస్తే

► గతంలో జరిగిన ఇబ్బందులను, లోపాలను పరిగణలోకి తీసుకున్న టీఎస్‌పీఎస్సీ పకడ్భందీగా ఎగ్జామ్స్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. 

►ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనుండగా.. 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరు. 

►మధ్యాహ్నం పేపర్‌-2 పరీలో 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకు నిర్వహించనుండగా.. 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంట గంట నుంచి కేంద్రంలోకి అనుమతించనున్నారు. 

► ఈ నిబంధన నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని కమిషన్ పేర్కొంది.

చదవండి: లోకేశ్‌కుమార్‌ బదిలీ.. జీహెచ్‌ఎంసీ నెక్ట్స్‌ బాస్‌ ఎవరో?

►ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దని కమిషన్ సూచించింది. ఇంకా షూ కూడా ధరించి రావొద్దని.. కేవలం చెప్పులతో మాత్రమే రావాలని తెలిపింది. 

► అభ్యర్థులను తనిఖీ తరువాత కేంద్రంలోకి అనుమతించనున్నారు. దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో వేలిముద్ర తప్పనిసరి చేశారు. అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్ కు అందించి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. 

► ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్ కు అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ.. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషన్ స్పష్టం చేస్తోంది. అలాంటి వారిపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు సదరు అభ్యర్ధిని మిగతా అన్ని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించనున్నట్లు తెలిపింది. 

►ఓఎంఆర్ షీట్లో బ్లూ/బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది. 

► హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదని కమిషన్ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement