జీవ క్రిమిసంహారకాలు | Biological insecticides | Sakshi
Sakshi News home page

జీవ క్రిమిసంహారకాలు

Aug 30 2016 2:28 AM | Updated on Sep 4 2017 11:26 AM

జీవ క్రిమిసంహారకాలు

జీవ క్రిమిసంహారకాలు

ప్రకృతిలో సహజంగా లభించే వివిధ రకాల మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా వంటి ప్రకృతి పరమైన జీవరాశుల ...

ప్రకృతిలో సహజంగా లభించే వివిధ రకాల మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా వంటి ప్రకృతి పరమైన జీవరాశుల నుంచి తయారుచేసిన పురుగు మందులను జీవ క్రిమిసంహారకాలు లేదా బయోపెస్టిసైడ్స్ అంటారు. పంట మొక్కలకు ఆశించే తెగుళ్లు, క్రిమికీటకాలు, కీటక డింభకాలను అరికట్టేందుకు జీవ క్రిమి సంహారకాలను వినియోగిస్తారు. వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు. అవి..

 1. జీవరసాయన జీవ క్రిమిసంహారకాలు
(Biochemical Biopesticides)
 2. సూక్ష్మజీవ క్రిమిసంహారకాలు
 (Microbial Pesticides)
 3. వృక్ష సంబంధిత క్రిమి సంహారకాలు
    (Plant Incorporated Protectants)

 జీవరసాయన జీవ క్రిమిసంహారకాలు
 జంతువుల శరీరం లేదా మొక్కల నుంచి తయారుచేసిన రసాయన పదార్థాలను పురుగుమందులుగా వాడతారు.
 ఉదా: కొన్ని జంతువులు ఫెర్మోన్లు అనే రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి. ఈ ఫెర్మోన్లలను ప్రయోగించి ఆడ కీటకాలను లేదా మగ కీటకాలను ఆకర్షించి వాటిని పట్టుకుని చంపేస్తారు.

 ఈ రసాయనాలతో కూడిన బుట్టలను ఉపయోగించడం వల్ల కీటకాలను సంహరించవచ్చు.

సూక్ష్మజీవ క్రిమిసంహారకాలు
బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులను క్రిమిసంహారకాలుగా వాడతారు. వీటినే సూక్ష్మజీవ క్రిమిసంహారకాలు అంటారు.

బ్యాక్టీరియా: బాసిల్లస్ తురంజెనిసిస్ అనే బ్యాక్టీరియా విడుదల చేసే విష పదార్థం అనేక తెగుళ్లను కలిగించే జీవులను చంపుతుంది. Bt-ట్యాక్సిన్‌ను విడుదల చేసే జన్యువును పత్తి, వంకాయ వంటి వాటిలో ప్రవేశపెట్టి  Bt- పత్తి, Bt- వంకాయలను ఉత్పత్తి చేశారు.

 వైరస్‌లు: బాక్యులో వైరస్ కుటుంబానికి చెందిన కొన్ని వైరస్‌లు ఆర్థోపొడా వర్గానికి చెందిన పురుగులను నాశనం చేస్తాయి.

  గ్రాన్యులో వైరస్:
వీటిని ప్రపంచ కీటక సంహారిణిగా వాడుతున్నారు.
శిలీంధ్రాలు: ట్రైకోడెర్మా, ట్రైకోగామా, బవేరియా బస్సీనా వంటి శిలీంధ్రాలను ప్రపంచవ్యాప్తంగా సూక్ష్మజీవ నాశకాలుగా వాడుతున్నారు. ఈ శిలీంధ్రాలు కొన్ని రకాల యాంటీ బయోటిక్స్, ట్యాక్సిన్స్‌ను విడుదల చేస్తాయి. ట్రైకోడెర్మా అనే శిలీంధ్రం Trichothecene, Sesquiterpene, Trichodermin అనే విషపూరిత పదార్థాలను విడుదల చేస్తాయి. ఇవి అనేక soil borne diseasesను నియంత్రిస్తాయి. దాదాపు 800 రకాల శిలీంధ్రాలను ఇప్పటి వరకు గుర్తించారు.

 వృక్ష సంబంధ క్రిమిసంహారకాలు
(Plant Incorporated Protectants)
 మొక్కల నుంచి లభించే వివిధ రకాల రసాయన పదార్థాలను వ్యాధి కారక సూక్ష్మ జీవులను, కీటకాలను నాశనం చేయడానికి వినియోగిస్తారు.

 ఉదా॥వేపచెట్టు నుంచి తీసిన ‘‘అజాడిరక్తిన్’’ (Azadirachtin) కీటక నాశినిగా పనిచేస్తుంది. వేప నూనె, వేప కషాయాన్ని నిమ్మ, పత్తి పంటల్లో కీటకనాశినిగా వినియోగిస్తారు.

 1.లెగ్యూమ్ జాతి మొక్కల నుంచి తీసిన "Rotenone‘ అనే పదార్థాన్ని కీటకనాశినిగా, ఊజీటజి Fish Poisonవాడతారు.
 2.గడ్డి చేమంతి (Chrysanthemum) నుంచి పెరిత్రిన్ (Pyrethrin)అనే రసాయనాన్ని తయారుచేస్తారు. ఇది దోమల నివారిణిగా, కీటక నివారిణిగా పనిచేస్తుంది.

  ఉపయోగాలు
 1.    ఇవి ఉపయోగకరమైన జీవులకు నష్టం కలిగించవు.
 2.    పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడతాయి.
 3.    ఇవి రసాయన క్రిమిసంహారకాల వలె కాకుండా నిర్దేశిత కీటకాలు, కీటక డింభకాలను మాత్రమే నాశనం చేస్తాయి.
 4.    రసాయనిక పురుగు మందుల వాడకాన్ని తగ్గిస్తాయి.
 5.    కాలుష్య రహితం, పర్యావరణహితంగా ఉంటాయి.
 6.    {పకృతిలో త్వరగా కలిసిపోతాయి.
 7.    తక్కువ మోతాదులో కూడా అద్భుతంగా పనిచేస్తాయి.
 8.    రసాయన పురుగు మందులతో పోలిస్తే ఖర్చు తక్కువ. ప్రతి రైతు వీటిని తయారు చేసుకోవచ్చు.
 9.    ఎక్కువ కాలం చైతన్యవంతంగా ఉంటాయి.
 10. రసాయన పురుగు మందుల వాడకం వల్ల కొంత కాలానికి కీటకాలకు నిరోధక సామర్థ్యం పెరుగుతుంది. జీవ క్రిమిసంహారకాల్లో ఈ సమస్య ఉత్పన్నం కాదు.
 11. జీవ క్రిమిసంహారకాలతో సమగ్ర సస్యరక్షణకు వీలవుతుంది.
 12. రసాయన మందుల అవశేషాలు పంటలపై ఉండటం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. బయోపెస్టిసైడ్‌‌స వల్ల ఈ సమస్య ఏర్పడదు.

  పరిమితులు
 1.    కొన్ని రకాల కీటకాల బారి నుంచి మాత్రమే పంటలకు రక్షణ కల్పిస్తాయి.
 2.    వీటి ప్రభావం ఉష్ణోగ్రత, తేమ మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది.
 3.    వీటి ప్రభావం నెమ్మదిగా ఉంటుంది. వేగంగా కీటకాలను చంపలేవు.
 4.    పెద్దమొత్తంలో తయారుచేయడం చాలా కష్టం.
 5.    ఎక్కువ కాలం నిల్వ ఉండవు.
 6.    ఖర్చు ఎక్కువ. విరివిగా మార్కెట్‌లో లభ్యం కావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement