పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 191 పోస్టులు | 191 posts in Punjab National Bank | Sakshi
Sakshi News home page

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 191 పోస్టులు

Aug 24 2016 3:19 AM | Updated on Sep 4 2017 10:33 AM

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 191 పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 191 పోస్టులు

ప్రభుత్వ బ్యాంకుల్లో పలు కొలువుల నియామకాలకు ప్రకటనల జారీ పరంపర కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్..

ప్రభుత్వ బ్యాంకుల్లో పలు కొలువుల నియామకాలకు ప్రకటనల జారీ పరంపర కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్.. మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సంబంధిత వివరాలు సమగ్రంగా..  
 మొత్తం పోస్టులు: 191

 పోస్టుల వారీ ఖాళీలు: చీఫ్ మేనేజర్ (ఆర్కిటెక్ట్)-1; మేనేజర్ (ఐటీ)-75; మేనేజర్ (అగ్రికల్చర్)-30; మేనేజర్ (సెక్యూరిటీ)-35; మేనేజర్ (హెచ్‌ఆర్‌డీ)-24; మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీర్)-2; మేనేజర్ (సివిల్ ఇంజనీర్)-3; మేనేజర్ (మెకానికల్ ఇంజనీర్)-1; మేనేజర్ (లా)-1; ఫైర్ ఆఫీసర్స్-6; ఆఫీసర్ (ఎకనామిక్స్)-2; ఆఫీసర్ (సివిల్ ఇంజనీర్)-4; ఆఫీసర్ (ఇండస్ట్రీ) మెకానికల్-2; ఆఫీసర్ (ఇండస్ట్రీ) ఎలక్ట్రికల్- 1; ఆఫీసర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్)-4.
 రిజర్వేషన్‌ల వారీగా ఖాళీలు: ఎస్సీ-26, ఎస్టీ-20, ఓబీసీ-48, జనరల్ 97. మొత్తం మీద 7 పోస్టులను పీడబ్ల్యూడీలకు రిజర్వ్ చేశారు.

 వేతనం: చీఫ్ మేనేజర్‌కు రూ.50,000-59,170; మేనేజర్‌కు రూ.31,705-45,950; మిగిలిన పోస్టులకు రూ.23,700-42,020.   
 విద్యార్హత: 2016, ఆగస్టు 23 నాటికి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
 వయసు: చీఫ్ మేనేజర్‌కు కనీస వయసు 35 ఏళ్లు, గరిష్టం 45 ఏళ్లు; మేనేజర్ (ఐటీ)కి కనీసం 25 ఏళ్లు, గరిష్టం 28 ఏళ్లు; మేనేజర్(అగ్రికల్చర్; సెక్యూరిటీ; ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఇంజనీర్, లా)కు కనీసం 25 ఏళ్లు, గరిష్టం 35 ఏళ్లు; సెక్యూరిటీ మేనేజర్‌కు కనీసం 21 ఏళ్లు, గరిష్టం 35 ఏళ్లు; ఫైర్ ఆఫీసర్‌కు కనీసం 25 ఏళ్లు, గరిష్టం 40 ఏళ్లు; ఆఫీసర్ (ఎకనామిక్స్)కు కనీసం 21 ఏళ్లు, గరిష్టం 28 ఏళ్లు; ఆఫీసర్ (సివిల్; ఇండస్ట్రీ మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్)కు కనీసం 21 ఏళ్లు, గరిష్టం 30 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

 ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
 ఆన్‌లైన్ పరీక్ష: 120 నిమిషాల(2 గంటల) వ్యవధిలో జరిగే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఇందులో నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ఒక తప్పు సమాధానానికి పావు (0.25) మార్కు కోత విధిస్తారు.  

 దరఖాస్తు విధానం: ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలి.
 దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.50; జనరల్, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లు రూ.400 చెల్లించాలి.   
 రాత పరీక్ష కేంద్రం: రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే పరీక్ష కేంద్రం (హైదరాబాద్) కేటాయించారు.  
 ముఖ్య తేదీలు:
 1.    ఆన్‌లైన్ అప్లికేషన్‌కు చివరి తేదీ: 2016, సెప్టెంబర్ 9
 2.    రాత పరీక్షను 2016, అక్టోబర్ 14న నిర్వహించే అవకాశం ఉంది.
 3.    హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: 2016, అక్టోబర్ 4 తర్వాత  
 వెబ్‌సైట్: www.pnbindia.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement