యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందాటి రమేష్‌రెడ్డి తండ్రి ప్రతాప్‌రెడ్డి(58) సోమవారం రాత్రి మృతిచెందాడు.
చిట్యాల
యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందాటి రమేష్‌రెడ్డి తండ్రి ప్రతాప్‌రెడ్డి(58) సోమవారం రాత్రి మృతిచెందాడు. మంగళవారం చిట్యాలలో ప్రతాప్‌రెడ్డి మృతదేహానికి సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు పూలమాలలు వేసి నివాళులర్పించి అంత్యక్రియలలో పాల్గొన్నారు. కందాటి రమేష్‌రెడ్డిని వారు పరామర్శించి ఓదార్చారు. ఇంక మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, సాగర్ల గోవర్ధన్, నాయకులు పోకల దేవదాసు, జడల ఆదిమల్లయ్య, కందిమళ్ల శిశుపాల్‌రెడ్డి, జడల చినమల్లయ్య, ఏళ్ల వెంకట్‌రెడ్డి, దుబ్బాక వెంకట్‌రెడ్డి, కట్టంగూరి మల్లేష్, జిట్ట బోందయ్య, మెండె సైదులు, బొబ్బల శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.