గ్రహం అనుగ్రహం, జూన్ 9, 2015 | graham anugraham, june 9, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, జూన్ 9, 2015

Jun 9 2015 2:11 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, జూన్ 9, 2015 - Sakshi

గ్రహం అనుగ్రహం, జూన్ 9, 2015

శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం..

శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బ.సప్తమి ప.11.01 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం శతభిషం ప.2.38 వరకు తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం రా.8.35 నుంచి 10.05 వరకు, దుర్ముహూర్తం ఉ.8.04 నుంచి 8.55 వరకు, తదుపరి రా.10.54 నుంచి 11.44 వరకు, అమృతఘడియలు ఉ.7.30 నుంచి 9.01వరకు

భవిష్యం    
మేషం: పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక ప్రగతి. వస్తు, వస్త్ర లాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంతో ముందుకెళతారు.
వృషభం: దూరపు బంధువులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి.  ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తి తగాదాలు తీరతాయి. వ్యాపారాలు అనుకూలం. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
మిథునం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: పనుల్లో జాప్యం జరుగుతుంది. అనారోగ్యం. ప్రయాణాల్లో అవరోధాలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులు.
సింహం: మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూ, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
తుల: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు కనిపిస్తుంది. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
వృశ్చికం: అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆలయాలను సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
ధనుస్సు: బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సఖ్యతగా మెలగుతారు. విందు వినోదాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాల్లో మార్పులు ఉంటాయి. అనారోగ్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కుంభం: బంధువర్గంతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి లాభం. పనులు చకచకా సాగుతాయి. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మీనం: చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రుణాలు చేస్తారు. ఆరోగ్య భంగం. శ్రమ మరింతగా పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు చోటుచేసుకుంటాయి.
 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement