గ్రహం అనుగ్రహం, ఆగస్టు 13, 2015 | graham anugraham, august 13, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, ఆగస్టు 13, 2015

Aug 13 2015 1:05 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, ఆగస్టు 13, 2015 - Sakshi

గ్రహం అనుగ్రహం, ఆగస్టు 13, 2015

శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం..

 శ్రీ మన్మథనామ సంవత్సరం
 దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
 నిజ ఆషాఢ మాసం, తిథి బ.చతుర్దశి రా.6.23 వరకు, తదుపరి అమావాస్య
 నక్షత్రం పుష్యమి రా.11.40 వరకు
 వర్జ్యం ఉ.7.05 నుంచి 8.44 వరకు
 దుర్ముహూర్తం ఉ.10.01 నుంచి 10.47 వరకు
 తదుపరి ప.3.00 నుంచి 3.51 వరకు
 అమృతఘడియలు సా.5.10 నుంచి 6.50 వరకు

భవిష్యం
 
మేషం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణ యత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

 వృషభం: కార్యజయం కలుగుతుంది. శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ లాభం. వ్యాపార, ఉద్యోగాల్లో ముందడుగు.
 
మిథునం: పనుల్లో ప్రతి బంధకాలు. బంధువులతో వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త పర్చుకోండి. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
 
కర్కాటకం: ముఖ్యులతో చర్చలు జరుపుతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహన యోగం. పలుకుబడి పెరుగుతుంది. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
సింహం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చిక్కులు.
 
కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.  శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ప్రోత్సాహం.
 
తుల: నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. మిత్రులు, బంధువులతో సఖ్యతగా మెలగుతారు. విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
 
వృశ్చికం: బంధువర్గంతో విభేదాలుంటాయి. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
 
ధనుస్సు: రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.
 
మకరం: బంధువులతో సంతోషంగా గడుపుతారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. భూవివాదాలు పరిష్కరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
 
కుంభం: పనులు చకచకా పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయటా ప్రోత్సాహం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకెళతారు.
 
మీనం: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు నెలకొంటాయి. వ్యయ ప్రయాసలు. బంధు విరోధాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement
 
Advertisement
Advertisement