అక్కరకు రాని ప్యాకేజీలు

Economic Package Central Should Focus On Lockdown Affected People - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీలో ఏమేం వుంటాయో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరసగా అయిదు రోజులపాటు అందరికీ తేటతెల్లం చేశారు. భారీ మొత్తం అని ప్రధాని చెప్పారుగనుక... జీడీపీలో పది శాతం అన్నారు గనుక ఈ ఉద్దీపనల పరంపరపై ఆశలు కూడా అదే స్థాయిలో భారీగా వున్నాయి. చివరాఖరికి ఇవి ఎవరినీ సంతృప్తిపరచకపోగా... ఈ వంకన ప్రైవేటీకరణకు, ఇతరత్రా సంస్కరణ లకు కేంద్రం పావులు కదుపుతోందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది.

దీర్ఘకాల ప్రయోజనా లను దృష్టిలో వుంచుకుని ఈ ఉద్దీపనలను రూపొందించామని మంత్రి చెబుతున్నారు. కానీ లాక్‌డౌన్‌ పర్యవసానంగా పూట గడవడం కూడా కష్టమైన జనాభాకు తక్షణం చేసేదేమిటో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై వుంది. కనీసం అంతంతమాత్రంగా వున్న జీడీపీని మందకొడిగా కదిలించడానికైనా ఈ ఉద్దీపనల పరంపర దోహదపడుతుందా అన్నది అనుమానమే. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ను మోదీ ప్రకటించిన నాటికే కేంద్రం, ఆర్‌బీఐ రూ. 9 లక్షల 94 వేల 403 కోట్ల విలువైన ఉద్దీపనలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రకటించిన అయిదు ఉద్దీపనల విలువ రూ. 11 లక్షల 2 వేల 650 కోట్లు. ఈ రెండింటి విలువా లెక్కేస్తే అది రూ. 20 లక్షల 97 వేల 53 కోట్లు.

సారాంశంలో ప్రధాని ముందుగా చెప్పిన రూ. 20 లక్షల కోట్ల కంటే ఇది దాదాపు లక్ష కోట్లు అదనం. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో తాను చాలా ఉదారంగా వున్నానన్న అభిప్రాయం కేంద్రంలో దండిగా వున్నట్టే కనబడుతోంది. ఆ అభి ప్రాయం సామాన్యుల్లో కలగజేయడానికి కూడా ప్రయత్నించివుంటే బాగుండేది. ప్రకటించినదాన్లో వాస్తవంగా నగదు రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందరికీ అందేది ఎంతన్నదే కీలకం. ఈ ఉద్దీపనల పర్యవసానంగా బడ్జెట్‌పై ఎంత శాతం భారం పడుతుందన్న ప్రశ్నకు మంత్రి జవాబివ్వ లేదు. ఆ మాట చెప్తే కరోనా వల్ల కేంద్రం అదనంగా మోస్తున్న భారమెంతో తెలిసేది. అది రూ. 2.02 లక్షల కోట్లని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతుంటే... లక్షన్నర కోట్లు దాటదని మరికొందరి నిపు ణుల అభిప్రాయం. మొత్తానికి జీడీపీలో ఒక శాతం దాటదని వారు లెక్కలు కడుతున్నారు. మరి కేంద్రం చేసిందేమిటి?

మొదటిరోజు నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఉద్దీపన ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు సంబంధించింది. వాటికి బ్యాంకుల నుంచి రూ. 3 లక్షల కోట్ల మేర రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పడంతోపాటు అందుకు ఎలాంటి హామీ చూపనవసరం లేదన్నారు. కానీ కేంద్రంలో ఆ పరిశ్రమలకు సంబంధించిన శాఖను చూస్తున్న నితిన్‌ గడ్కారీ చెబు తున్న లెక్క ప్రకారం ఆ సంస్థలకు ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు చెల్లించాల్సిన బకాయిల విలువే రూ. 5 లక్షల కోట్లు! కనుకనే ‘మాపై అంత ఔదార్యం చూపాల్సిన అవసరం లేదు... మాకు రావాల్సిన బకాయిలేవో తీర్చండి చాల’ని ఎంఎస్‌ఎంఈలు మొత్తుకుంటు న్నాయి.
 

లాక్‌డౌన్‌కు ముందే అవి నానా అగచాట్లూ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో వాటికి నగదు లభ్యత పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఈ అయిదు ఉద్దీపనల్లోనూ మొత్తంగా కేంద్రం 40 రకాల చర్యల్ని ప్రకటించింది. కానీ వీటిల్లో అత్యధికం సంస్కరణ లకు సంబంధించినవే తప్ప లిక్విడిటీని పెంచగలిగేవి కాదు. ఈ కరోనా సమయంలో అందరికీ గుర్తొస్తున్న ప్రజారోగ్యానికి ఈ ఉద్దీపనల్లో చోటు దొరికింది. కానీ అందుకు ఎంత కేటా యించదల్చుకున్నదో కేంద్రం చెప్పలేదు. ఎంఎస్‌ఎంఈలు, చిన్న వ్యాపారులు మొదలుకొని రాష్ట్రాల వరకూ దాదాపు అందరికందరూ రుణాలు తెచ్చుకోవాలి తప్ప కేంద్రం తనకు తానుగా ఇవ్వదల్చు కున్నది లేదు.

వలసజీవులకు రెండు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని, గ్రామీణ ఉపాధికి అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం బాగానేవుంది. కానీ వలసజీవుల్లో అత్యధికులు ఇప్పుడు నడిరోడ్లపై, రైలుపట్టాలపై వున్నారు. వందలు, వేల కిలోమీటర్ల దూరాల్లో వున్న స్వస్థలాలకు రాత్రనక, పగలనక నడిచిపోతున్నారు. ఆకలిదప్పులతో అలమటిస్తు న్నారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్ర తదితరచోట్ల మమ్మల్ని పోనీయమంటూ బయటికొచ్చిన వారిని చావగొడుతున్నారు. అలాంటివారికి ఇప్పుడు ప్రకటించిన ఉద్దీపనల్లోని చర్యలు ఏమేరకు దోహదపడతాయో కేంద్రం ఆలోచించిందా? దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం మీదుగా నడిచి వెళ్తున్న వలసకూలీల కష్టాలను చూసి చలించి ఆదరించి అన్నం పెడుతోంది. వారికి చెప్పుల జతతో సహా అన్నీ అందించి, రైళ్లు, బస్సుల్లో ఉచి తంగా వారి వారి స్వస్థలాలకు పంపుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చొరవ చూపాల్సిన అవసరం వుందని గుర్తించి, ఆ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి. 

కరోనా కష్టాలు మొదలైనప్పటినుంచీ దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆదాయం పడిపోయి, ఖర్చు అమాంతంగా పెరిగి అప్పు తెచ్చుకోవడానికి అనుమతించాలని కోరుతున్నాయి. తెచ్చుకునే రుణాలు జీడీపీలో 3 శాతం మించి వుండకూడదన్న నిబంధన మార్చాలంటున్నాయి. అందుకు కేంద్రం కూడా ఒప్పుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి దాన్ని 5 శాతానికి పెంచడానికి అంగీకరించింది. కానీ అందుకు విధించిన షరతులు విస్తుగొలుపుతాయి. మొదటి 0.5శాతం వరకూ పేచీలేదు. ఆ తర్వాత పెంచ దల్చుకున్నవాటికి సంస్కరణలతో ముడిపెట్టింది. ఆ సంస్కరణల సారాంశం జనంపై ఆర్థిక భారం మోపడం. విద్యుత్‌చార్జీలు, మున్సిపల్‌ పన్నులు వగైరాలు పెంచితే ప్రభుత్వాలు అప్పులు తెచ్చు కోవచ్చని చెప్పడం అన్యాయం, అమానుషం. దేశ జనాభాలో అత్యధిక శాతంమంది ఇప్పుడు విప త్కర పరిస్థితుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వారిని రక్షించడమెలాగన్న అంశంపై దృష్టి పెట్టడం ఇప్పటి అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ సంగతి గ్రహించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

02-06-2020
Jun 02, 2020, 18:35 IST
న్యూఢిల్లీ: శానిటైజ‌ర్‌.. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత మ‌హా న‌గ‌రం నుంచి మారుమూల ప‌ల్లె వ‌ర‌కు ఇది వాడ‌ని వారే లేరంటే అతిశ‌యోక్తి...
02-06-2020
Jun 02, 2020, 16:34 IST
సొంత రాష్ట్రం చేరుకున్న వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కండోమ్‌లను పంపిణీ చేస్తోంది.
02-06-2020
Jun 02, 2020, 16:32 IST
 సాక్షి, విజయవాడ :  లాక్‌డౌన్‌ కారణంగా సుమారు రెండు నెలల తరువాత రైళ్లు, విమానాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది....
02-06-2020
Jun 02, 2020, 15:57 IST
ఇస్లామాబాద్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడికై విధించిన లాక్‌డౌన్‌ను త్వరలోనే ఎత్తివేయనున్నట్లు పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు....
02-06-2020
Jun 02, 2020, 15:50 IST
తొలి కరోన కేసు బయట పడినప్పటికీ ఎపిడమాలోజిస్ట్‌లను సంప్రదించి, తగిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని నివేదిక పేర్కొంది. 
02-06-2020
Jun 02, 2020, 14:51 IST
సాక్షి, చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు...
02-06-2020
Jun 02, 2020, 14:44 IST
సాక్షి, ‘కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సందర్భంగా వలస కార్మికులు క్షేమంగా ఇళ్లకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బస్సులను, ప్రత్యేక రైళ్లను...
02-06-2020
Jun 02, 2020, 14:13 IST
అనుమతి ఇవ్వండి.. యుద్దంలో గెలిచి చూపిస్తాను
02-06-2020
Jun 02, 2020, 13:58 IST
సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాస్పిటల్ బెడ్స్, ఇతర సమాచారం కోసం  ‘‘ఢిల్లీ కరోనా" యాప్ ను...
02-06-2020
Jun 02, 2020, 13:20 IST
అచ్చంపేట: కరోనా వైరస్‌ వ్యాధితో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం పట్టణంలోని మధురానగర్‌కాలనీలో పాజిటివ్‌ కేసు నమోదు కావటంతో ఆ...
02-06-2020
Jun 02, 2020, 13:08 IST
జెనీవా:  కరోనా వైరస్‌​ ఇక  తమ దేశంలో లేదంటూ  ప్రకటించిన ప్రముఖ ఇటాలియన్ వైద్యుడు వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ...
02-06-2020
Jun 02, 2020, 12:32 IST
బాలీవుడ్ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు , గాయ‌కుడు వాజీద్ ఖాన్ (42) అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ముంబైలోని చెంటూర్ ఆసుప‌త్రిలో క‌న్నుమూసిన...
02-06-2020
Jun 02, 2020, 11:23 IST
బ్రస్సెల్స్: ‘క్వారంటైన్‌ నియమాలు ఉల్లంఘించి ఓ సామాజిక కార్యక్రమానికి హాజరయ్యాను. క్షమించండి’ అంటూ బెల్జియన్‌ యువరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలు.. బెల్జియం...
02-06-2020
Jun 02, 2020, 11:07 IST
సాక్షి,సిటీబ్యూరో:గ్రేటర్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. తాజాగా సోమవారం మరో 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం  అత్యధికంగా 122...
02-06-2020
Jun 02, 2020, 09:35 IST
అహ్మ‌దాబాద్ : భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తోంది. సామాన్య ప్ర‌జానీకం ద‌గ్గ‌ర నుంచి ప్ర‌జా ప్ర‌తినిధుల వ‌ర‌కు ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు...
02-06-2020
Jun 02, 2020, 09:22 IST
బర్త్‌డే పార్టీని మించిన ఈవెంట్‌ ఉండదు లోకంలో. ఎవరికి వారే కింగ్‌ / క్వీన్‌ ఆ రోజు. సెంటర్‌ ఆఫ్‌...
02-06-2020
Jun 02, 2020, 09:16 IST
కోవిడ్‌తో ప్రపంచం యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధానికి సాధనాలుగా, ఆయుధాలుగా కొత్త ఆవిష్కరణలెన్నో పుట్టుకొస్తున్నాయి. అలాంటిదే ఈ వెదురు ఫర్నిచర్‌....
02-06-2020
Jun 02, 2020, 08:45 IST
ఢిల్లీ : క‌రోనా వైర‌స్ సోకిన 63 ఏళ్ల వ్య‌క్తి ఆసుప‌త్రిలోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న ఢిల్లీలో చోటుచేసుకుంది. మీఠాపూర్...
02-06-2020
Jun 02, 2020, 08:43 IST
కరోనా పూర్తిగా అదుపులోకి వస్తే తప్ప స్కూళ్లను తెరవవద్దంటూ దేశ వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
02-06-2020
Jun 02, 2020, 08:28 IST
మొయినాబాద్‌: ఈ నెల 8 నుంచి దేవాలయా లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సడలి ంపు ఇచ్చినా చిలుకూరు బాలాజీ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top