ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతి భద్రతలను గాలి కొదిలేశారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలను గాలి కొదిలేశారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు మేయర్ అనురాధ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పోలీసుల అసమర్ధతకు మేయర్ హత్య దర్పణమని అంబటి అన్నారు. తనకు ప్రాణ హాని ఉందని మేయర్ కోరినా..ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో పాలనను గాలికి వదిలి వైఎస్సార్సీపీ నేతలను, పార్టీని టార్గెట్ చేస్తున్నారని అంబటి ఆరోపించారు.