నీటిమీటర్లపై వైఎస్సార్‌సీపీ సంతకాల సేకరణ | ysrcp corporators taking signatures against water meters in vijayawada | Sakshi
Sakshi News home page

నీటిమీటర్లపై వైఎస్సార్‌సీపీ సంతకాల సేకరణ

Apr 26 2016 12:33 PM | Updated on May 29 2018 3:40 PM

విజయవాడ నగరంలో నీటి మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గాంధీనగర్: విజయవాడ నగరంలో నీటి మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక లెనిన్ సెంటర్‌లో నీటిమీటర్ల నిర్ణయాన్ని వ్యతిరేకించే ప్రజల నుంచి సంతకాలను సేకరిస్తున్నారు.

నీటి మీటర్లు పెట్టి, వినియోగానికి అనుగుణంగా ఛార్జీలు వసూలు చేయాలని మంత్రి నారాయణ ఇటీవల ఓ ప్రకటన చేసిన నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అత్యవసరంగా కార్పొరేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి నీటి మీటర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీలతోపాటు కార్పొరేటర్లు భవకుమార్, దామోదర్, నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement