సీసీఎస్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ | ysr rtc majdur union contest in ccs election | Sakshi
Sakshi News home page

సీసీఎస్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌

Nov 26 2016 11:19 PM | Updated on Mar 19 2019 9:15 PM

ఏపీఎస్‌ఆర్టీసీ సీసీఎస్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ బరిలో దిగుతోందని రీజినల్‌ కార్యదర్శి ఆర్‌వీ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

అనంతపురం న్యూసిటీ : ఏపీఎస్‌ఆర్టీసీ సీసీఎస్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ బరిలో దిగుతోందని రీజినల్‌ కార్యదర్శి ఆర్‌వీ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయాలనే నినాదంతో రీజియన్‌లోని అన్ని డిపోల్లో పోటీ చేస్తున్నామన్నారు. వచ్చే నెల 16న జరిగే ఎన్నికల్లో కార్మికులు తమ యూనియన్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement