మల్లన్నను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌ | ys jagan mohan reddy offers Prayers at srisailam | Sakshi
Sakshi News home page

మల్లన్నను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

Jan 6 2017 9:06 AM | Updated on Jul 25 2018 4:42 PM

మల్లన్నను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌ - Sakshi

మల్లన్నను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

వైస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం ఉదయం శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకున్నారు.

కర్నూలు : వైస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకున్నారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం జేఈవో, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కాగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి రెండోరోజుకు చేరింది.

శ్రీశైలం నియోజకవర్గం దోర్నాలలో యాత్ర కొనసాగనుంది. ముందుగా దోర్నాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్ మాట్లాడతారు. అక్కడ నుంచి ఆత్మకూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement