మండుటెండలో సైతం.. భక్తిభావం ఉప్పొంగగా.. | Devotees From Karnataka And Maharashtra Came To Srisailam | Sakshi
Sakshi News home page

అడుగడుగునా ఆధ్యాత్మికం 

Apr 10 2021 11:01 AM | Updated on Apr 10 2021 11:01 AM

Devotees From Karnataka And Maharashtra Came To Srisailam - Sakshi

చెక్క కాళ్లపై శ్రీశైలానికి అడుగులు

తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని పాదయాత్రగా బయలుదేరిన కన్నడిగులు వడివడిగా ఇల కైలాసం చేరుకుంటున్నారు. వారి ఆధ్యాత్మిక మార్గంలో అడుగడుగునా భక్తిభావం ఉప్పొంగుతుండగా.. మండుటెండలు సైతం చిన్నబోతున్నాయి.

సాక్షి, శ్రీశైలం/టెంపుల్‌: తమ ఇంటి ఆడపడుచు భ్రమరాంబకు సారె సమర్పించాలని.. తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని పాదయాత్రగా బయలుదేరిన కన్నడిగులు వడివడిగా ఇల కైలాసం చేరుకుంటున్నారు. వారి ఆధ్యాత్మిక మార్గంలో అడుగడుగునా భక్తిభావం ఉప్పొంగుతుండగా.. మండుటెండలు సైతం చిన్నబోతున్నాయి. నల్లమల అడవులు చల్లని గాలులతో స్వాగతం పలుకుతున్నాయి. అన్నదాతలు ఆహారపానీయాలు అందిస్తూ వారి సేవలో తరిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం అధికారులు మౌలిక వసతులు కల్పించి భరోసా కల్పిస్తున్నారు. ఉగాది ఉత్సవాలకు తరలిస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతో శ్రీశైలంలో సందడి నెలకొంది.
చదవండి:
నేరుగా అమ్మ దర్శనానికే..!
ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు ఐలా నోటీసులు


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement