యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద | youth awards in nanayya university | Sakshi
Sakshi News home page

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

Jan 10 2017 12:04 AM | Updated on Sep 5 2017 12:49 AM

సమాజం కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చిన మహనీయుడు, త్యాగశీలి స్వామి వివేకానందుడని ఆదికవి నన్నయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. నాటికి, నేటికి, ఏనాటికైనా ఆయన యువతకు సూర్ఫి ప్రదాతగా నిలుస్తారన్నారు.

రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) :
సమాజం కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చిన మహనీయుడు, త్యాగశీలి స్వామి వివేకానందుడని ఆదికవి నన్నయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. నాటికి, నేటికి, ఏనాటికైనా ఆయన యువతకు సూర్ఫి ప్రదాతగా నిలుస్తారన్నారు. సాంస్కృతిక సేవా సంస్థ ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ, నన్నయ వర్సిటీలు సంయుక్తంగా సోమవారం ఇక్కడ నిర్వహించిన యువజనోత్సవాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భారతీయుల తోజోమయుడు, అఖండంగా ప్రకాశించే సూర్యుని వంటి వాడు వివేకానందుడని ప్రముఖ న్యాయవాది చింతా పద్మారావు అన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఆధ్యాత్మికవేత్తని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రాష్ట్రంలో సామాజిక సేవలందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలను గుర్తించి, వారికి ‘హుమానిటేరియ¯ŒS ఆఫ్‌ ఇండియా’ అవార్డులను అందజేసి, గౌరవించారు.  ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ ప్రతినిధి అద్దంకి రాజాయోనా, నన్నయ వర్సిటీ అధ్యాకులు ఎస్‌.టేకి, ఎ.మట్టారెడ్డి, విజయనిర్మల, నిట్టల కిరణ్‌చంద్ర, ఎం.భాస్కరరావు, జానకీరావు, కేవీఎ¯ŒSడీ వరప్రసాద్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement