breaking news
youth awards
-
‘కబుర్ల దేవత’ కేంద్ర బాల సాహిత్య పురస్కారం
ఢిల్లీ: బాల సాహిత్య, యువ పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 24 భాషల్లో ఉత్తమ రచనలను ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్ రచించిన 'కబుర్ల దేవత' (స్టోరీ) పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం లభించింది. సాహిత్య యువ పురస్కారానికి ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల ఎంపికైంది.భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో పలు పుస్తకాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు జ్యూరీ సభ్యులు సిఫారసు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలోని సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అవార్డు గ్రహీతల వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారాన్ని ప్రకటించలేదు. 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే యువ పురస్కారాలను ప్రకటించింది. -
యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : సమాజం కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చిన మహనీయుడు, త్యాగశీలి స్వామి వివేకానందుడని ఆదికవి నన్నయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. నాటికి, నేటికి, ఏనాటికైనా ఆయన యువతకు సూర్ఫి ప్రదాతగా నిలుస్తారన్నారు. సాంస్కృతిక సేవా సంస్థ ఫిలాంత్రోఫిక్ సొసైటీ, నన్నయ వర్సిటీలు సంయుక్తంగా సోమవారం ఇక్కడ నిర్వహించిన యువజనోత్సవాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భారతీయుల తోజోమయుడు, అఖండంగా ప్రకాశించే సూర్యుని వంటి వాడు వివేకానందుడని ప్రముఖ న్యాయవాది చింతా పద్మారావు అన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఆధ్యాత్మికవేత్తని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రాష్ట్రంలో సామాజిక సేవలందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలను గుర్తించి, వారికి ‘హుమానిటేరియ¯ŒS ఆఫ్ ఇండియా’ అవార్డులను అందజేసి, గౌరవించారు. ఫిలాంత్రోఫిక్ సొసైటీ ప్రతినిధి అద్దంకి రాజాయోనా, నన్నయ వర్సిటీ అధ్యాకులు ఎస్.టేకి, ఎ.మట్టారెడ్డి, విజయనిర్మల, నిట్టల కిరణ్చంద్ర, ఎం.భాస్కరరావు, జానకీరావు, కేవీఎ¯ŒSడీ వరప్రసాద్ పాల్గొన్నారు.