స్నేహితులతో కలసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ఎస్‌ఎస్ ట్యాంకులో మునిగి మృత్యువాత పడ్డాడు.
ఈతకెళ్లి యువకుడి మృతి
Nov 3 2016 12:12 AM | Updated on Sep 4 2017 6:59 PM
	  సంతోష్‌నగర్ దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో మునిగి మృత్యువాత పడ్డాడు. 
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	కర్నూలు :  స్నేహితులతో కలసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ఎస్‌ఎస్ ట్యాంకులో మునిగి మృత్యువాత పడ్డాడు. బుధవారం కర్నూలు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని కృష్ణారెడ్డి నగర్‌లో నివాసముంటున్న నాగేశ్వరరెడ్డి కుమారుడు జగదీశ్వరరెడ్డి(20) స్నేహితులు ధను, సంతోష్, నానిలతో కలసి మంగళవారం మధ్యాహ్నం సంతోష్ నగర్ దగ్గర నున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఈతకొట్టేందుకు వెళ్లారు. 3 గంటల సమయంలో జగదీశ్వర్‌రెడ్డి నీటిలో మునిగిపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురై పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. వెంటనే సంఘటన స్థలం వద్దకు చేరుకుని గాలించారు. గట్టుపైన బట్టలు, చెప్పులు కనిపించాయి. చీకటి పడటంతో వెనుదిరిగి వచ్చారు. బుధవారం ఉదయం ఆత్మకూరు నుంచి గత ఈతగాళ్లను రప్పించి ఎస్‌ఎస్ ట్యాంకులో గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం 5 గంటల సమయంలో వారు మృతదేహాన్ని వెలికి తీశారు. నాగేశ్వరరెడ్డి, జయమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, జగదీశ్వరరెడ్డి రెండవ కుమారుడు. ఇంటర్ వరకు చదువుకున్నాడు. హైదరబాదులో పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఇటీవలే కర్నూలుకు వచ్చాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకునా్నరు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడా లేక స్నేహితులే నీటిలో ముంచారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
