ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో.. | Young woman commits suicide in medak | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో..

Aug 5 2016 5:48 PM | Updated on Nov 6 2018 7:56 PM

ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్న యువతి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది.

 ప్రేమించిన యువకుడి ని పెళ్లి చేసుకుంటానంటే తల్లిదండ్రులు నిరాకరించడంతో.. మనస్తాపానికి గురైన యువతి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న యువతి కొద్దిసేపటి క్రితం మృతిచెందింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జప్తిశివనూర్ గ్రామానికి చెందిన శిరీష(18) స్థానికంగా నివాసముంటున్న ఓ యువకుడిని ప్రేమించింది.

 

అతన్నే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. దీనికి వారు ససేమీరా అనడంతో.. వారం రోజుల క్రితం వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందింది. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement