చికిత్స పొందుతున్న యువకుడి మృతి | young person died | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న యువకుడి మృతి

Aug 12 2016 7:09 PM | Updated on Sep 28 2018 3:41 PM

చికిత్స పొందుతున్న యువకుడి మృతి - Sakshi

చికిత్స పొందుతున్న యువకుడి మృతి

కట్టంగూర్‌ : చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

కట్టంగూర్‌ : చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొల్లేపల్లి గ్రామానికి చెందిన ఎర్ర ప్రశాంత్‌(22) 2016 జూన్‌ 7న కట్టంగూర్‌ నుంచి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలోని మీరాసాహెబ్‌గూడెం స్టేజీ సమీపంలో మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శుక్రవారం నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. కాగా ప్రశాంత్‌ ఇటీవల నల్లగొండ ఎస్‌ఆర్‌టీఐ కళాశాలలో బీటెక్‌ ఈఈఈ పూర్తిచేశాడు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ యూసఫ్‌జానీ పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement