యువకుడి ఆత్మహత్య | young men suside with health problem | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Jul 19 2016 6:37 PM | Updated on Sep 4 2017 5:19 AM

ముత్తారం మండలం బుధవారంపేట (రామయ్యపల్లి) శివారులో మంథని మండలం సిద్దపల్లికి చెందిన కలవేన సంతోష్‌(22) ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంతోష్‌ అది భరించలేక అఘాయిత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపారు.

ముత్తారం : ముత్తారం మండలం బుధవారంపేట (రామయ్యపల్లి) శివారులో మంథని మండలం సిద్దపల్లికి చెందిన కలవేన సంతోష్‌(22) ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంతోష్‌ అది భరించలేక అఘాయిత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన సంతోష్‌ రాత్రి 7గంటల ప్రాంతంలో సమీప బంధువుకు ఫోన్‌ చేసి గ్రామ శివారులోని గుట్ట వైపు దారిలో తాను క్రిమిసంహారక మందు తాగినట్లు చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు అర్ధరాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. అప్పటికే సంతోష్‌ సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ లేకపోవడంతో స్విచ్ఛాఫ్‌ అయ్యింది. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న రైతులు మతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. సంతోష్‌ తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement