యాదవ మహాసభ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా రాములు | Yadava mahasabha district president Ramulu | Sakshi
Sakshi News home page

యాదవ మహాసభ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా రాములు

Jul 29 2016 12:26 AM | Updated on Sep 4 2017 6:46 AM

యాదవ మహాసభ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా రాములు

యాదవ మహాసభ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా రాములు

అఖిల భారత యాదవ మహాసభ రైతు విబాగం జిల్లా అద్యక్షుడిగా ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మారబోయిన రాములు యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మహాసభ జిల్లా అద్యక్షుడు గిరబోయిన రాజయ్య తెలిపారు.

హన్మకొండ చౌరస్తా : అఖిల భారత యాదవ మహాసభ రైతు విబాగం జిల్లా అద్యక్షుడిగా ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మారబోయిన రాములు యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మహాసభ జిల్లా అద్యక్షుడు గిరబోయిన రాజయ్య తెలిపారు. హన్మకొండలోని సంఘం కార్యాలయంలో గురువారం రైతు సంఘం ఎన్నికలు నిర్వహించినట్లు చెప్పారు. ఉపాధ్యక్షులుగా గెంటె కొమురయ్య, గుండెబోయిన నాగయ్య, కాడబోయిన నర్సయ్య, మర్రి గట్టయ్య, ప్రధాన కార్యదర్శులుగా మండల సత్యనారాయణ, రేక దర్గయ్య, కార్యదర్శులుగా నర్రావుల సింహాద్రి, జిల్లెల్ల రాజు, బొద్దు వెంకన్న, మేకల గోపాల్, మాన్క రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వివరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement