సత్వరమే పనులు పూర్తి చేయండి | works complete quickly | Sakshi
Sakshi News home page

సత్వరమే పనులు పూర్తి చేయండి

Dec 5 2016 12:05 AM | Updated on Sep 4 2017 9:54 PM

స్థానిక స్పోర్ట్సు ఆథారిటి స్టేడియంలో రూ. 6 కోట్లతో చేపడుతున్న క్రీడా సముదాయాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు ప్రభుత్వానికి విన్నవించారు.

- క్రీడా సముదాయాల నిర్మాణంపై ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు
కర్నూలు (టౌన్‌): స్థానిక స్పోర్ట్సు ఆథారిటి స్టేడియంలో రూ. 6 కోట్లతో చేపడుతున్న క్రీడా సముదాయాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు ప్రభుత్వానికి విన్నవించారు. ఆదివారం స్థానిక స్టేడియం ప్రాంగణంలో నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.  క్రీడా సముదాయాల నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితం పూర్తి కావాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల జాప్యం జరిగిందన్నారు. మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలో బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, వాలీబాల్‌ లాంటి క్రీడాంశాల సాధనకు ఎంతో అనువుగా ఉంటుందన్నారు. అలాగే బాక్సింగ్, రెజ్లింగ్, తైక్వాండో, చెస్, క్యారమ్స్, రైఫిల్‌ షూటింగ్, వెయిట్‌ లిఫ్టింగ్, రెజ్లింగ్‌ క్రీడాంశాలకు వినియోగించుకోవచ్చన్నారు. స్పోర్ట్సు అథారిటి స్టేడియం అధికారులు తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement