జర్నలిస్టుల సంక్షేమానికి కృషి | working for the welfare of Journalists | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Mar 9 2017 10:36 PM | Updated on Sep 5 2017 5:38 AM

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు.

ఆదిలాబాద్‌ టౌన్  : జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌ పట్టణంలోని పీఆర్టీయూ సంఘ భవనంలో మంత్రి జోగు రామన్నకు టీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

మంత్రి రామన్న మాట్లాడుతూ త్వరలో జర్నలిస్టులకు నివాస స్థలాలు అందజేస్తామన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం భరిస్తుందన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించారు. ఏఎంసీ చైర్మన్  ఆరె రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బేత రమేశ్, రాజు, కోశాధికారి ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు అన్వర్, సంఘ బాధ్యులు ఆంజనేయులు, రఘునాథ్, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement