బాయిలర్‌లో పడి కార్మికుడి మృతి | worker died after fall in boiler at nellore district | Sakshi
Sakshi News home page

బాయిలర్‌లో పడి కార్మికుడి మృతి

Jul 21 2016 1:58 PM | Updated on Sep 4 2017 5:41 AM

బాయిలర్‌లో పడి ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో గురువారం వెలుగు చూసింది.

ముత్తుకూరు: బాయిలర్‌లో పడి ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో గురువారం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన రామదాసు(40) నేలటూరులోని ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ రోజు విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బాయిలర్‌లో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement