వలసలను నివారించేందుకు అడిగి ప్రతి ఒక్కరికీ పని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పుల్లారెడ్డి తెలిపారు.
అడిగిన వారందరికీ పనులు కల్పిస్తాం
Mar 28 2017 12:13 AM | Updated on Aug 25 2018 5:17 PM
– వేసవిలో ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు
– పనుల కోసం 0866–2432064 ఫోన్ చేయవచ్చు..
– డ్వామా పీడీ పుల్లా రెడ్డి వెల్లడి
కర్నూలు (అగ్రికల్చర్) : వలసలను నివారించేందుకు అడిగి ప్రతి ఒక్కరికీ పని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పుల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వలసలు వెళ్లే గ్రామాన్ని సందర్శించి అందుకు గల కారణాలను తెలుసుకొని పనులు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని 36 కరువు మండలాల్లో ఇప్పటికే 100 రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలకు అదనంగా 50 రోజులు పనిదినాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ప్రత్యేక వేసవి అలవెన్సులు ఇస్తున్నామని, ఉపాధి పనులు సంబంధిత గ్రామానికి 5కి.మీల దూరంలోనే పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఒకవేళ ఐదు కిలో మీటర్లు దాటి పనులు కల్పిస్తే 10 శాతం రవాణా భత్యాన్ని అందజేస్తామని తెలిపారు. పనులు కావాలనుకునే వారు 0866–2432064కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
Advertisement
Advertisement