ఎస్సార్‌లో ఉమెన్స్ టెక్నాలజీ పార్కు ప్రారంభం
ఎప్పటికప్పుడు సాంకేతిక రంగంలో నూతన మార్పులు వస్తున్నాయని.. వీటిని విద్యార్థినులు అందిపుచ్చుకోవాలని నిజామాబాద్ ఎంపీ కవిత సూచించారు. వరంగల్ శివారు అన్నాసాగరంలోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో డీఎస్‌టీ(డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఉమెన్స్ టెక్నాలజీ పార్క్‌ను శనివారం ఆమె ప్రారంభించారు.


