దేవుడు మనలోనే ఉన్నాడు | womens retreat program | Sakshi
Sakshi News home page

దేవుడు మనలోనే ఉన్నాడు

Sep 10 2016 9:56 PM | Updated on May 29 2018 6:01 PM

దేవుడు మనలోనే ఉన్నాడు - Sakshi

దేవుడు మనలోనే ఉన్నాడు

మంచి పనులు చేస్తూ అందరికీ సహాయపడే ధోరణితో మెలిగితే దేవుడు మనలోనే ఉంటాడని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరి వైఎస్‌ విమలారెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలోని క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్, డాక్టర్‌ జాన్‌వెస్లీ అంతర్జాతీయ పరిచర్యల ఆధ్వర్యంలో ‘వుమెన్స్‌ రిట్రేట్‌’ శనివారం జరిగింది.

  • వైఎస్‌ సోదరి విమలారెడ్డి
  • కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
    మంచి పనులు చేస్తూ అందరికీ సహాయపడే ధోరణితో మెలిగితే దేవుడు మనలోనే ఉంటాడని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరి వైఎస్‌ విమలారెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలోని క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్, డాక్టర్‌ జాన్‌వెస్లీ అంతర్జాతీయ పరిచర్యల ఆధ్వర్యంలో ‘వుమెన్స్‌ రిట్రేట్‌’ శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా విమలారెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు శిలువ మరణం పొందుతూ శత్రువులపై కూడా చూపిన  క్షమాగుణాన్ని మానవులందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ ప్రసంగీకులు డాక్టర్‌ జాన్‌వెస్లీ మాట్లాడుతూ మహిళలు దేవుని సువార్తను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. క్రైస్ట్‌ వర్షిప్‌ సంఘ«జనులు విమలారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దేవుని విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జోసెఫ్‌ విజయ్‌కుమార్, డి.రాజ్‌కుమార్, బి.రవి, జాన్‌పీటర్‌ పాల్గొన్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement