breaking news
vimala reddy
-
వైఎస్ విమలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
వివేకా హత్య కేసు: వైఎస్ విమలారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, కర్నూల్: వైఎస్ వివేకా హత్య కేసు విషయమై వైఎస్సార్ సోదరి వైఎస్ విమలారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకాను చంపిన వారు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారని అన్నారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, వైఎస్ విమలమ్మ బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం, విమలమ్మ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఇంకా లిక్విడ్స్‌పైనే ఉన్నారని అన్నారు. ఈ క్రమంలోనే వివేకాను హత్య చేసిన వాళ్లు బయట తిరుగుతుంటే తప్పు చేయని అవినాష్ కుటుంబం ఎంతో బాధపడుతోంది. ఏ తప్పు చేయని అవినాష్‌ను టార్గెట్ చేయడం సరికాదు. తప్పు చేయలేదంటున్న వాళ్లు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. వివేకా హత్యలో మా ఫ్యామిలీ వాళ్లు లేరని మొదట చెప్పిన వైఎస్ సునీత ఇప్పుడు ఎందుకు మాట మార్చిందో తెలియదు. సునీత వెనుక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి. అసత్య ఆరోపణల వల్ల అవినాష్ తల్లి తల్లడిల్లిపోతోంది. అవినాష్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అవినాష్‌ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. న్యాయం జరుగుతుందున్న నమ్మకంతో అవినాష్ ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అనారోగ్యంపై విష కథనాలా? -
Makeover Tips: టైమ్‌పాస్ కోసం చేరా.. 2 గంటలకు ఆరున్నర వేలు.. ఇలా చేస్తే
Makeover Tips: ఏ వేడుకకు ఏ డ్రెస్ వేసుకోవాలో సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకోవడం మనకు తెలిసిందే! అలాగే, ముఖం రోజంతా ఫ్రెష్‌గా కనిపించాలంటే ఏ మేకప్ వాడాలి?! కురులను కొంగొత్తగా సింగారించాలంటే ఏ స్టైల్‌ని ఫాలో అవ్వాలి?! అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మేకప్ ఆర్టిస్ట్ గురించిన వెతుకులాట తప్పదు. టాప్ టు బాటమ్ లుక్ స్టైల్‌గా, సంప్రదాయంగా, సందర్భానుసారంగా అతివల కలలకు మెరుగులు దిద్దే మేకోవర్ ఆర్టిస్ట్ విమలారెడ్డి చెబుతున్న వివరాలివి.. ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి ఆర్గానిక్ కెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా క్లాసులు తీసుకున్న లెక్చరర్ విమలారెడ్డి హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఉంటున్నారు. ఎనిమిదేళ్లుగా మేకోవర్ ఆర్టిస్ట్‌గా ఈ రంగంలో రాణిస్తున్నారు. బ్రైడల్, సీజనల్, సెలబ్రిటీ మేకోవర్‌పై వర్క్ చేస్తున్న విమలారెడ్డి తన గురించిన విశేషాలే కాదు, మేకప్ అండ్ హెయిర్‌కి సంబంధించిన వివరాలనూ తెలియజేశారు. ‘‘లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్న నేను పెళ్లయ్యాక ఆరు నెలలు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో పేపర్లో బ్యూటీ కోర్స్ ప్రకటన చూసి, టైమ్‌పాస్ కోసం వెళ్లి, చేరాను. ఆ తర్వాత తిరిగి లెక్చరర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఏడేళ్ల క్రితం నాతోపాటు కోర్సు చేసిన అమ్మాయి ఓ పెళ్లి ఫంక్షన్లో సాయంగా ఉండమని కోరితే వెళ్లాను. రెండు గంటలు సాయం చేస్తే ఆరున్నర వేల రూపాయలు వచ్చాయి. దీంతో కొన్నాళ్లు టీచింగ్ చేస్తూనే బ్యుటీషియన్గానూ ఆర్డర్స్ మీద బ్రైడల్ మేకప్ చేస్తుండేదాన్ని. నాకు నచ్చిన టైమ్‌లో వర్క్ చేయచ్చు. ఆర్థికంగానూ బాగుందనిపించింది. దీంతో పూర్తిగా మేకోవర్‌నే వృత్తిగా మార్చుకొని ఈ రంగంలోకి వచ్చాను. నాకు పెన్సిల్ ఆర్ట్ అంటే చిన్నప్పుటి నుంచి ఇష్టం ఉండేది. ఆ ఆర్ట్ మేకప్‌లో నాకుబాగా సాయపడింది. పెళ్లితో పాటు ఇతర సెలబ్రేషన్స్, సెలబ్రిటీస్తోనూ వర్క్ చేయడం నచ్చింది. కొన్ని షూట్స్ వల్ల అవకాశాలు కూడా బాగా వచ్చాయి. ఇటీవల ‘గ్రే’ తెలుగు మూవీకి మేకప్ ఆర్టిస్ట్‌గానూ చేశాను. 2019లో మేకప్ కాంపిటీషన్లో పాల్గొని, గెలుపొందాను. అలాగే, మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్‌కి సంబంధించిన క్లాసులూ తీసుకుంటున్నాను. కంటి మేకప్ యూనివర్సల్ సహజంగా కనిపించాలని, వేసవిలో కళ్ల వరకు మాత్రమే వాటర్‌ప్రూఫ్ మేకప్‌ని కోరుకునేవారున్నారు. పెదాలకు గ్లాసీ లిపిస్టిక్ వాడితే సరిపోతుంది. చాలావరకు మనవాళ్లందరికీ కళ్ల చుట్టూ, మూతిచుట్టూ, నుదుటిపైన కొద్దిపాటి నలుపు ఉంటుంది. వీటిని కవర్ చేసుకుంటే చాలు, ఎక్కువ మేకప్ లేకపోయినా చేయకపోయినా నీట్‌గా కనిపిస్తుంది. కళ్లు డల్‌గా కనిపించకుండా ఉండటానికి మస్కారా, లిప్‌స్టిక్ వేసుకుంటే చాలు ఫ్రెష్‌లుక్ కనిపిస్తుంది. చర్మరక్షణ ముఖ్యం పెళ్లి వంటి ముఖ్యమైన సందర్భాలు ఉన్నప్పుడు కొన్ని నెలల ముందే మమ్మల్ని సంప్రదిస్తుంటారు. వారి ఫొటోస్ మాకు పంపిస్తారు. వాళ్ల స్కిన్ టోన్ (ఆయిలీ, డ్రై, కాంబినేషన్ స్కిన్) ఏంటో కనుక్కొని అందుకు తగిన జాగ్రత్తలు చెబుతుంటాను. వాడాల్సిన ఫేస్‌వాష్, టోనర్, ఫేషియల్స్ గురించి మాత్రమే కాదు తీసుకునే ఆహారం, డెర్మటాలజిస్ట్‌ను కలవాల్సిన అవసరం, వ్యాయామాలు... దాదాపు 6 నెలల ముందే అన్నీ చెబుతాను. మాంసాహారం తగ్గించమని, జ్యూసులు, నీళ్లు, సలాడ్స్ ఎక్కువ తీసుకోమని చెబుతాను. అలాగే, లేట్ నైట్స్ ఆహారం తీసుకోవద్దని, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే మానేయమని చెబుతుంటాను. నెలకు ఒకసారి రెడీ మేడ్ మాస్క్ అయినా వేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఆరోగ్యం బాగుంటే చర్మం, జుట్టు కూడా బాగుంటుంది. అప్పుడు మేకోవర్ కూడా హెల్దీగా కనిపిస్తుంది. నాణ్యమైన ఉత్పత్తులు మేకప్, డ్రెస్, హెయిర్, జ్యువెలరీ .. ఇవన్నీ సెట్ చేయడానికి 3–4 గంటల సమయం పడుతుంది. మేకప్‌కి వాడే ప్రొడక్ట్స్ క్వాలిటీ బట్టి ధర ఉంటుంది. ఉపయోగించిన మేకప్ 12 నుంచి 16 గంటల వరకైనా తాజాగా ఉండే ఖరీదైన ప్రొడక్ట్స్ వచ్చాయి. వీటితో ఫినిషింగ్ మాత్రమే కాదు చర్మం కూడా బాగుంటుంది. కొన్ని ప్రొడక్ట్స్ ఉపయోగించినా మేకప్ చేసుకున్నట్టు తెలియదు. అంత నేచురల్‌గా ఉంటాయి. వేడుకల సమయాలను బట్టి మా వర్క్ ఉంటుంది. దీనిని అర్థం చేసుకునే కుటుంబం, పని పట్ల శ్రద్ధ, ఈ రంగంలో ఎదగాలన్న తపన ఉంటే ఈ రంగంలో ఎవరైనా రాణించవచ్చు’ అని వివరిస్తారు ఈ మేకోవర్ ఆర్టిస్ట్. – నిర్మలారెడ్డి నేటి మేకప్ ట్రెండ్స్ ►నేటి పెళ్లిళ్లలో చాలా వరకు వాటర్ ఫ్రూఫ్, గ్లాసీ, ట్రాన్స్పరెంట్ మేకప్ ఎక్కువ వాడుతున్నారు. ►పెళ్లి సమయంలో చమట పట్టే అవకాశం ఉంది. అలాగే, అప్పగింతలప్పుడు వారికి తెలియకుండానే ఏడ్చేస్తుంటారు. ►ఇలాంటప్పుడు మేకప్ చెదరకుండా, దాదాపు ఎనిమిది గంటల పాటు ఉండాలంటే వాటర్‌ఫ్రూఫ్ మేకప్ సరైన ఎంపిక అవుతుంది. ►నేచురల్‌గా హెల్దీ లుక్ కనిపించడంతో పాటు షైనీగా ఉండాలనుకునేవారు గ్లాసీ మేకప్‌ను ఎంచుకుంటారు. ►ట్రాన్స్పరెంట్ కూడా అలాంటిదే. లిప్‌స్టిక్ పెట్టుకొని తిన్నా, వేటికీ అంటుకోకుండా ఉంటుంది. ►వేసవిలో వీటిని ఎక్కువ కోరుకుంటారు. ►నార్మల్ కెమరాతో కాకుండా హెచ్డి కెమరా పిక్సల్ సైజ్ బాగుంటుంది. అలాగే, హెచ్డీ క్వాలిటీ మేకప్ కూడా ఉంది. ►చేతులతో ముఖాన్ని టచ్ చేయకుండా మెషిన్‌తో ప్రొడక్ట్స్ స్ప్రే చేస్తూ మేకప్ చేస్తాం. దీనిని ఎయిర్‌బ్రష్ మేకప్ అంటాం. ► చదవండి: Aishwarya Bhagyanagar: మూడు వందలకు పైగా డాన్స్ ప్రదర్శనలు.. అంతేకాదు చిత్రకారిణి కూడా! -
దేవుడు మనలోనే ఉన్నాడు
వైఎస్ సోదరి విమలారెడ్డి కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : మంచి పనులు చేస్తూ అందరికీ సహాయపడే ధోరణితో మెలిగితే దేవుడు మనలోనే ఉంటాడని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి వైఎస్ విమలారెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలోని క్రైస్ట్ వర్షిప్ సెంటర్, డాక్టర్ జాన్‌వెస్లీ అంతర్జాతీయ పరిచర్యల ఆధ్వర్యంలో ‘వుమెన్స్ రిట్రేట్’ శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా విమలారెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు శిలువ మరణం పొందుతూ శత్రువులపై కూడా చూపిన క్షమాగుణాన్ని మానవులందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ ప్రసంగీకులు డాక్టర్ జాన్‌వెస్లీ మాట్లాడుతూ మహిళలు దేవుని సువార్తను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. క్రైస్ట్ వర్షిప్ సంఘ«జనులు విమలారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దేవుని విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జోసెఫ్ విజయ్‌కుమార్, డి.రాజ్‌కుమార్, బి.రవి, జాన్‌పీటర్ పాల్గొన్నారు.