ఉరేసుకుని మహిళ ఆత్మహత్య | Woman suicide by hanging | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

Jul 25 2016 10:49 PM | Updated on Nov 6 2018 7:56 PM

సూర్యాపేటమున్సిపాలిటీ : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ ఘటన ఆదివారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది.

సూర్యాపేటమున్సిపాలిటీ : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ ఘటన ఆదివారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం యల్లమ్మగూడెం గ్రామానికి చెందిన శ్రావణిని అర్వపల్లి మండలం లోయపల్లి గ్రామానికి చెందిన లింగయ్యకు 2015లో ఇచ్చి వివాహం చేశారు. లింగయ్య, శ్రావణి దంపతులు సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డలో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. లింగయ్య పట్టణంలోని ఓ దుకాణంలో టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శ్రావణిని కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం తేవాలంటూ వేధించసాగుతున్నాడు. శ్రావణి ఇంటి వద్ద పరిస్థితి బాగా లేకపోవడంతో చేసేది ఏమి లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  శ్రావణి మృతదేహానికి సోమవారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో బంధువులు లింగయ్యపై  దాడికి దిగారు. శ్రావణి బంధువుల ఫిర్యాదు మేరకు లింగయ్యపై వరకట్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement