రైలు ఢీకొని ఒడిశా మహిళ మృతి | woman died in a train accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని ఒడిశా మహిళ మృతి

Dec 10 2016 8:23 PM | Updated on Nov 6 2018 7:56 PM

శ్రీకాకుళం జిల్లాలో గుణుగూర్ ప్యాసింజర్ రైలు ఢీకొని ఒడిశాకు చెందిన మహిళ మృతిచెందింది.

పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గోపాలపురం వద్ద గుణుగూర్ ప్యాసింజర్ రైలు ఢీకొని ఒడిశాకు చెందిన మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. బతుకుదెరువు కోసం ఒడిశా రాష్ట్రం గౌతమి ప్రాంతం నుంచి పాతపట్నం వచ్చిన సంతోష్‌రెడ్డి, రేణుకరెడ్డి కుటుంబం క్వారీలో కార్మికులుగా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో నేటి సాయంత్రం రేణుకరెడ్డి గోపాలపురం వద్ద రైలు పట్టాలు దాటుతుండగా ప్యాసింజర్ రైలు ఢీకొనగా అక్కడిక్కడే మృతిచెందింది. మృతురాలికి కన్నారెడ్డి, సాయికృష్ణారెడ్డి అనే పిల్లలు ఉన్నారు. అప్పుల బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. పలాస రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement