అలేఖ్యకు అభినందనలు | Weldon aekhya | Sakshi
Sakshi News home page

అలేఖ్యకు అభినందనలు

Sep 25 2016 12:09 AM | Updated on Sep 4 2017 2:48 PM

అలేఖ్య, తండ్రి కృష్ణారావును సన్మానిస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

అలేఖ్య, తండ్రి కృష్ణారావును సన్మానిస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ఎంసెట్‌ –3లో 7వ ర్యాంక్‌ సాధించిన మిట్టపల్లి అలేఖ్యను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని మర్లపాడు సాయిబాబా ఆలయం వద్ద సర్పంచ్‌ భీమిరెడ్డి పావని అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఆయ న మాట్లాడారు.

మర్లపాడు(వేంసూరు):  ఎంసెట్‌ –3లో 7వ ర్యాంక్‌ సాధించిన మిట్టపల్లి అలేఖ్యను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని మర్లపాడు సాయిబాబా ఆలయం వద్ద సర్పంచ్‌ భీమిరెడ్డి పావని అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఆయ న మాట్లాడారు. ఎంసెట్‌–3లో 7వ ర్యాంక్‌ సాధించిన అలేఖ్యకు ఎ¯ŒSటీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థికసాయం అందిస్తునట్లు తెలిపారు. ప్రతి ఏటా రూ.10వేలు ఆర్థిక సాయం అందిస్తానని మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. లయి¯Œ్స క్లబ్‌ జో¯ŒS చెర్మ¯ŒS గండ్ర సోమిరెడ్డి దంపతులు అలేఖ్యను సన్మానించి రూ.10వేలు అందజేశారు. మర్లపాడుకు చెందిన భీమిరెడ్డి మాధవరెడ్డి  సు«ధాకర్‌రెడ్డిలు ఉంగరం బహుమతిగా అందజేశారు. గ్రామస్తులు ఒక ఉంగరం, రూ.50 నగదు బహుమతిగా అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భీమిరెడ్డి పావని, ఎంపీటీసీ మందపాటి వెంకయమ్మ, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, ఎంఈఓ వెంకటేశ్వరరావు, వెల్ధి జగ¯ŒSమోహ¯ŒSరావు, టీడీపీ మండల అధ్యక్షుడు మిరియాల ప్రసాద్, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, లచ్చన్నగూడెం సొసైటీ అధ్యక్షుడు భీమిరెడ్డి చెన్నకేశవరెడ్డి, మందపాటి బాపిరెడ్డి, గొర్ల రాంమోహ¯ŒSరెడ్డి, నడిపల్లి సతీష్, అమరరెడ్డి, ముత్తరెడ్డిలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement