ఖమ్మంలో పట్టుబడ్డ పాత నోట్ల కట్టలు

Police Catches Huge Amount Of Old Currency In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం :  జిల్లాలోని వేంసూరు మండలంలో పోలీసులు నిర్వహించిన సోదాలో ఓ ఇంట్లో భారీగా పాత నోట్ల కట్టలు బయటపడ్డాయి. వివరాలు.. వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో నడిపల్లి దామెదర్‌ ఇంటిని కొన్ని రోజల క్రితం ఓ వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఇంట్లో రూ.12లక్షల పాత కరెన్సీని రూ.500, రూ.1000 నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి భారీగా నిల్వచేశాడు. వీటిని కంటెయినర్‌లో అమర్చే విధంగా పెద్ద బాక్స్‌లాగా అమర్చాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందగా బుధవారం సదరు వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలో అధిక మొత్తంలో పాత కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసు​కున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దున మర్లపాడు గ్రామం ఉండటంతో దొంగనోట్ల మార్పిడికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు రూ. 100 కోట్ల మేర ఇలాంటి కరెన్సీ ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఈ వ్యక్తిపై సత్తుపల్లిలో దొంగనోట్ల ముఠాలోని కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, పాత కరెన్సీ నిల్వ చేసిన ఇంటిని కల్లూరు ఏసీపీ వెంకటేశ్, వేంసూరు ఎస్‌ఐ నరేశ్‌ పరిశీలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top