సెంట్రల్ జైలు ఖైదీ పరారీ | warangal central jail Prisoner escapes from bus in yashwanthpur | Sakshi
Sakshi News home page

సెంట్రల్ జైలు ఖైదీ పరారీ

May 16 2016 5:22 PM | Updated on Sep 4 2017 12:14 AM

సెంట్రల్ జైలు ఖైదీ పరారీ

సెంట్రల్ జైలు ఖైదీ పరారీ

వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీ ఉప్పల సూరి పోలీసుల కళ్లుగప్పి సోమవారం పరారయ్యాడు.

వరంగల్:
కోర్టు నుంచి బస్సులో తీసుకెళ్తుండగా టాయిలెట్కని దిగిన ఓ జీవిత ఖైదీ తప్పించుకు పారిపోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా జనగామ మండలం యశ్వంతాపూర్ వద్ద చోటుచేసుకుంది. వరంగల్ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉప్పల సూరిని పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ నిమిత్తం తీసుకువచ్చారు.

తిరిగి అతడిని భూపాలపల్లి డిపో బస్సులో వరంగల్‌కు తీసుకెళ్తున్నారు. యశ్వంతాపూర్ సమీపంలోకి వెళ్లగానే మూత్రం వస్తోందంటూ అతడు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు బస్సును ఆపించారు. అతడు బస్సు దిగి, మూత్రానికని దూరంగా వెళ్లి అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిపైకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అయినప్పటికీ అతడు దొరక్కుండా తప్పించుకుపోయాడు. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అతడి కోసం గాలింపు చేపట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement