‘ఏప్రిల్‌ 14 నుంచి వాలీబాల్‌ టోర్నీ’ | volley ball tourny on april 14th | Sakshi
Sakshi News home page

‘ఏప్రిల్‌ 14 నుంచి వాలీబాల్‌ టోర్నీ’

Mar 28 2017 11:40 PM | Updated on Jun 1 2018 8:39 PM

అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని బంజారాలకు జిల్లాస్థాయి వాలీబాల్‌ టోర్నీని ఏప్రిల్‌ 14 నుంచి నిర్వహిస్తున్నట్లు సేవాలాల్‌ ట్రస్ట్‌ అర్బన్‌ అధ్యక్షులు మహేష్‌నాయక్‌ తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని బంజారాలకు జిల్లాస్థాయి వాలీబాల్‌ టోర్నీని  ఏప్రిల్‌ 14 నుంచి నిర్వహిస్తున్నట్లు సేవాలాల్‌ ట్రస్ట్‌ అర్బన్‌ అధ్యక్షులు మహేష్‌నాయక్‌ తెలిపారు. స్థానిక లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాలలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని అండర్‌–25 వాలీబాల్‌ టోర్నీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నీని వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్దతండాలోని ఆర్డీటీ పాఠశాలలో ఏప్రిల్‌ 14 నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

ఆసక్తి గల వారు తమ జట్ల పేర్లను ఏప్రిల్‌ 10లోగా నమోదు చేసుకోవాలన్నారు. గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూ.10116, రెండవ బహుమతిగా రూ.5116 ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. వివరాలకు 9492222233, 9652427520 నెంబరుకు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పరమేష్‌నాయక్, సుబ్రహ్మణ్యం నాయక్, వెంకటరమణ, రాజు, వినోద్, గోపాల్, శీనానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement