పోలీసులకు కామినేని ప్రశంసలు | vijayawada Police gets appreciation from minister kamineni srinivas | Sakshi
Sakshi News home page

పోలీసులకు కామినేని ప్రశంసలు

Jul 16 2016 12:06 PM | Updated on Aug 7 2018 4:38 PM

పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు 36 గంటల్లో ఛేదించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.

విజయవాడ: పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు 36 గంటల్లో ఛేదించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన శనివారం ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం కామినేని మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

తల్లి ఒడికి చేరిన బాబు ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని కామినేని స్పష్టం చేశారు. కిడ్నాప్ ఘటనలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉంటే వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని చెప్పారు. కేసు ఛేదనలో పోలీసుల పాత్ర అమోఘమని మంత్రి ప్రశంసించారు. అన్ని ప్రభుత్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

మరోవైపు విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ శిశువు కిడ్నాప్ కేసులో అనేక ఆరోపణలు వస్తున్నాయని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామన్నారు. డబ్బులకు బాబును అమ్మారన్న కోణంలో కూడా విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రజలు తమకు పూర్తిగా సహకరించారని సీపీ పేర్కొన్నారు. చదవండి.... (బెజవాడ శిశువు మిస్సింగ్‌ కథ సుఖాంతం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement