వర్షం కోసం వరుణయాగం | varunayagam for rain | Sakshi
Sakshi News home page

వర్షం కోసం వరుణయాగం

Aug 29 2016 12:22 AM | Updated on Sep 4 2017 11:19 AM

సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలనిS వరుణయాగాలు చేస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈఓ సత్యనారాయణ తెలిపారు.

కర్నూలు (న్యూసిటీ) : సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలనిS వరుణయాగాలు చేస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈఓ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం నగరంలోని చిదంబరరావు వీధిలో వెలసిన నగరేశ్వరస్వామి ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. స్వామికి అభిషేకం చేసి, మల్లె, మారేడు దళాలతో అలంకరణ చేశారు. అర్చకులు రఘురామశర్మ, చంద్రశేఖరశ్మ, మురళీశర్మ, ధర్మకర్త మండలి సభ్యులు గోవిందరాజు, కష్ణమూర్తి, సత్యనారాయణ సింగ్, శేషుసింగ్, జితేంద్ర, భక్తులు పాల్గొన్నారు.
వెంగన్నబావి ప్రాంతంలో ఉన్న శివాలయంలో..
నగర శివారులోని వెంగన్నభావి దగ్గర ఉన్న వేములవెంగన్న శివాలయంలో ఈశ్వరునికి అభిషేకం చేసి, మల్లె పూలతో అలంకరణ చేశారు. అనంతరం వరుణయాగం, రుద్రహోమం నిర్వహించారు. కర్నూలు మండలాధ్యక్షుడు రాజావర్థన్‌రెడ్డి, దిన్నెదేవరపాడు సర్పంచు నాగన్న, దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు డీవీ సుబ్బయ్య, భక్తులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement