'మన అదృష్టం.. దుర్గమ్మ కొండ మీద ఉంది' | vangaveeti radha takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

'మన అదృష్టం.. దుర్గమ్మ కొండ మీద ఉంది'

Aug 5 2016 1:58 PM | Updated on Jul 28 2018 4:24 PM

'మన అదృష్టం.. దుర్గమ్మ కొండ మీద ఉంది' - Sakshi

'మన అదృష్టం.. దుర్గమ్మ కొండ మీద ఉంది'

విశ్వహిందూ పరిషత్ సభ్యుల దీక్షకు వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధ సంఘీభావం తెలిపారు.

విజయవాడ: తొలగించిన దేవాలయాలను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. దీక్ష చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులను శుక్రవారం వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధ పరామర్శించారు. దేవాలయాల పునర్నిర్మాణం కోసం వారు చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ.. మన అదృష్టం కొద్ది దుర్గమ్మ కొండ మీద ఉందని లేకుంటే..  అమ్మవారి దేవాలయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తొలగించే వారని ఎద్దేవా చేశారు.

కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు విజయవాడలోని దేవాలయాలను దర్శించుకునే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. తొలగించిన దేవాలయాలను వెంటనే పునర్నిర్మించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని వంగవీటి రాధ డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement